వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రుణమాఫీ ఫిర్యాదులు కోసం రైతులు కలెక్టరేట్ ఆవరణంలోకి చొచ్చుకు వచ్చారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టదా అంటూ అధికారులను నిలదీశారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి రైతులు తరలి వచ్చారు.