సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు.
సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సరదాగా ఐదుగురు స్నేహితులు పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఐదుగురు నీటిలోకి దిగిన అనంతరం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ దశలో వీరి అరుపులు విన్న సమీప పొలాల్లోని రైతులు ఇద్దరు యువకులను కాపాడగలిగారు. ముగ్గురు మాత్రం నీటిలో మునిగిచనిపోయారు. మృతులు కడప నగరానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతిచెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.