కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, లక్ష హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారులతో సూక్ష్మ, నీటిసాగులో సాంకేతిక అంశాల ప్రముఖ్యతపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో పంట సాగుకు అవకాశం ఉండగా, అందులో ప్రస్తుతం నాలుగు లక్షల హెక్టార్లలోనే సాగు జరుగుతోందన్నారు. ఆరు లక్షల హెక్టార్లలో పంట విస్తీర్ణానికి జిల్లాలో అవకాశం ఉందన్నారు. లక్ష హెక్టార్లలో బిందుసేద్యం లక్ష్యం కాగా, ప్రస్తుతం 22 వేల హెక్టార్లలో బిందుసేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండించేందుకు దరఖాస్తులు అందాయన్నారు. వాటిని పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వం సూక్ష్మనీటి సాగుకు, పరికరాల కొనుగోలుకు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు సబ్సిడీ పెంచిందన్నారు. పరికరాలు సరఫరా చేసే కంపెనీలో లాభాపేక్షతో కాకుండా నాణ్యమైన, ఎక్కువకాలం మన్నికగల పరికరాలను రైతులకు అందించి వాటి వినియోగంలో ఉన్న సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు, కంపెనీల ఇంజనీర్లు, ఏరియా అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు గ్రామాల్లో తిరిగి రైతుల్లో అవగాహన కల్పించి సూక్ష్మ నీటిసాగుపై ప్రేరణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, ఏరియా అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు, సూక్ష్మ సాగు పరికరాలు సరఫరా చేసే ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం
Published Wed, Aug 31 2016 1:37 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement
Advertisement