విద్యుత్‌ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే? | Negotiations Of Electricity Workers On PRC Successful In Telangana | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే?

Published Sat, Apr 15 2023 9:26 PM | Last Updated on Sat, Apr 15 2023 9:38 PM

Negotiations Of Electricity Workers On PRC Successful In Telangana - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. ఈ క్రమంలో ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీక‌రించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎండీ ప్ర‌భాక‌ర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

అనంతరం, ఏడు శాతం పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్‌ ఉద్యోగులు సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈ జాక్‌) తలపెట్టిన సమ్మె విషయం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ‌నివారం జ‌రిగిన చ‌ర్చ‌లు విజ‌య‌వంత‌మ‌య్యాయి. దీంతో, రేపటి నుంచి త‌ల‌పెట్టిన స‌మ్మె విర‌మించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement