తెలంగాణ: త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ | Hyderabad: Tsrtc Employees Will Get Prc Says Chairman Bajireddy Govardhan | Sakshi
Sakshi News home page

తెలంగాణ: త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ

Published Sat, Apr 15 2023 7:40 AM | Last Updated on Sat, Apr 15 2023 3:18 PM

Hyderabad: Tsrtc Employees Will Get Prc Says Chairman Bajireddy Govardhan - Sakshi

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్‌): టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో పీఆర్‌సీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శుక్రవారం భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాజిరెడ్డి గోవర్థన్‌ మాట్లాడుతూ...ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగుల భద్రత విషయంలో సంస్థ అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్, చీప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.రవీందర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.కృష్ణ, గడ్డం శ్రీనివాస్, ఈడీ మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement