సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఉద్యోగులకు.. 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం సవరించింది. జూన్ నెల నుంచి పెంచిన పీఆర్సీ అమలుకానుంది. అదే క్రమంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ వర్తింపు కానుందని ప్రభుత్వం తెలిపింది. పెన్షనర్ల మెడికల్ అలవెన్స్ రూ.350 నుంచి రూ.600కు పెంచారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు.
చదవండి: కరోనా వచ్చినా జీతం కట్ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment