సాక్షి, తాడేపల్లి: ప్రతి పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటాయని అవి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఉద్యోగిగా 6 పీఆర్సీలు చూశా. అప్పుడూ ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఉద్యోగులకు సమస్యలు రావడం సర్వసాధారణం. గెజిటెడ్ అధికారులకి సమస్యలు ఉన్నా రోడ్లు ఎక్కి ఆందోళన చెయ్యరు. గౌరవంగా మాట్లాడి పరిష్కరించుకుంటారు.
గతంలో దళిత అధికారులు అంటే చులకన భావం ఉండేది. పోస్టింగ్, ప్రమోషన్లలో అన్యాయం జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలాంటి అసోసియేషన్ వల్ల న్యాయం జరుగుతుంది. సీఎం జగన్ దళిత పక్షపాతి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. మంచి స్థానాల్లో దళిత అధికారులకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment