సాక్షి, హైదరాబాద్: పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి.
ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని, వేతనేతర, మెడికల్ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపాధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment