Teachers promotions
-
రోస్టర్ ప్రకటించకుండా పదోన్నతులా?
సాక్షి, అమరావతి: రోస్టర్ ప్రకటించకుండా పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండురోజుల క్రితం శుక్రవారం గుర్తింపు పొందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం విద్యాశాఖ వెల్లడించింది.అప్పటి సమావేశంలో మున్సిపల్ టీచర్ సంఘాలు గానీ, వారి ప్రతినిధులు గానీ లేకుండా తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. సోమవారమే సీనియారిటీ లిస్టు ప్రకటించడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశమిచి్చంది. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ టీచర్ల పదోన్నతులపై సర్విస్ రూల్స్, కోర్టు తీర్పులు పరిశీలించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలకు లోబడే సర్విస్ రూల్స్.. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో 2,115 మున్సిపల్ పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి 2018లో మున్సిపల్‌శాఖ పరిధిలోనే పదోన్నతులు కల్పించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలు చేసిన విధానాలనే మున్సిపల్ స్కూళ్లలోనూ అమలు చేస్తున్నారు. అయితే, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మాత్రం మున్సిపల్ చట్టాలకు లోబడే ఉన్నాయి. విద్యా సంబంధమైన అంశాల్లో రెండు విభాగాల స్కూళ్లల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం విద్యాశాఖ జీవో నం.84 జారీ చేసింది.దీని ప్రకారం అకడమిక్, పరిపాలనా పరమైన అంశాలను పాఠశాల విద్యాశాఖకు బదలాయించారు. దీనిపై మున్సిపల్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి విషయంలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇచ్చే పదోన్నతులు విద్యాశాఖ చట్టాల ప్రకారం ఇస్తున్నారా లేక మున్సిపల్ చట్టాల ప్రకారం కలి్పస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 26 తేదీతో సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కాగా, మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ అభ్యంతరకరంగా ఉందని, చివరిగా ఇచి్చన పదోన్నతుల్లో ఏ పోస్టుకు ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిందో వెల్లడించలేదని రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ అన్నారు. రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో కూడా తెలియదన్నారు.విద్యాశాఖ ప్రకటించిన పదోన్నతుల షెడ్యూల్ ఇదీ..⇒ 28–10–2024 సీనియారిటీ తాత్కాలిక జాబితా ప్రకటన ⇒ 28 నుంచి నవంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ ⇒ 4న సీనియారిటీ తుది జాబితా విడుదల ⇒ 6న గ్రేడ్–2 హెచ్ఎంల కౌన్సెలింగ్ ⇒ 8న స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్‌లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్‌ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై... ఈ నెల 19 వరకు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. డీఈవో, డీఎస్ఈతో పాటు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అధికారులు ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ టి.శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని, కేడర్‌ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారు. దీనిపై పిటిషనర్ల అభ్యంతరాలకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అయితే తుది సీనియారిటీ జాబితాను జారీ చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. లంచ్‌మోషన్‌లో పిటిషన్ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈనెల 19 వరకు సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ, అప్పటివరకు బదిలీలు, పదోన్నతులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. -
ప్రమోషన్లలో సీనియారిటీ లొల్లి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతు ల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) నుంచి ప్రధానోపాధ్యాయుడు (హెచ్ఎం)గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని కొందరు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో సీనియారిటీ రూపకల్పనలో తప్పులు దొర్లుతున్నాయని, దీనివల్ల కొందరు టీచర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరిగే వీలుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 3 నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా, సెప్టెంబర్ 1కి కటాఫ్ పెంచడంతో మంగళవారం వరకూ మరో 7 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. కాగా, పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు. జోనల్ సిస్టమ్‌తో సమస్యలు... 2022లో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్ పరిధిలోకి వస్తారు. రెండు జోన్లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి, సిద్దిపేటను మల్టిజోన్–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలతోపాటు సంగారెడ్డిని మల్టీజోన్–2 పరిధిలోకి తెచ్చారు. జోనల్ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదో న్నతులు కల్పించారు. అక్కడి పోస్టులు, ఖాళీల కు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్విసు ఉన్న వారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్విస్ ఉన్నా హెచ్ఎంలుగా ప్రమోష న్లు వచ్చాయి. ఇప్పుడు మల్టిజోన్ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే 19 జిల్లాల పరిధిలోని టీచర్ల ను మల్టిజోన్–1లో కి తేవాలి. 14 జిల్లా ల పరిధిలోని టీచర్లను మల్టిజోన్–2 పరిధిలోకి తేవాలి. ఇక్కడే సమస్య తలెత్తుతోందని, ఈ సమస్యలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయని టీచర్లు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎక్సెల్ ఫార్మాట్లో సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని టీచర్లు డీఈవోలకు ఫిర్యాదులు చేస్తున్నారు. మల్టిజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు చెబుతున్నారు. ఏడాది ఉన్నా వెళ్లాల్సిందేనా? రాష్ట్రవ్యాప్తంగా రెండు మల్టిజోన్ల పరిధిలో 1,974 హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సీనియారిటీని కొలమానంగా తీసుకుంటే దాదాపు వెయ్యి మందికిపైగా టీచర్లు మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్ వచ్చాక మల్టిజోనల్ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వెళ్లాల్సిందే. ఈ కారణంగా సర్విస్ తక్కువగా ఉన్న దాదాపు 800 మంది వరకూ పదోన్నతిని తిరస్కరించే వీలుంది. ప్రమోషన్, బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత పదోన్నతిని తిరస్కరించే వీలుంది. అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయని టీచర్లు అంటున్నారు. రిటైర్మెంట్ వయసులో హెచ్ఎం ప్రమోషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ చేయడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది. బదిలీలకు 50 వేల మంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు? ఆన్‌డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్‌ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్‌రెడ్డి కోరారు. -
హెచ్‌ఎంలతోనే సమస్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒప్పుకుంటేనే బదిలీల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లొచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారిని పరిగణనలోనికి తీసుకోని పక్షంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పదోన్నతులైనా కల్పించాలని కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాశాఖ నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఇప్పటివరకూ అన్ని కేటగిరీల టీచర్లకు సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే సీనియారిటీ జాబితాను రూపొందించారు. అయితే, హెచ్ఎంల విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వీరికి ఎంఈవోలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అదీగాక, ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షణ పోస్టుల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వివాదం పరిష్కారం కాలేదు. నిబంధనల ప్రకారం పర్యవేక్షణ పోస్టులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ హెచ్ఎంలు కోరుతున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని బడుల్లో ఉన్న హెచ్ఎంలకు పర్యవేక్షణ పోస్టులు ఇవ్వాల్సిందేనని మరికొంత మంది కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ జటిలంగానే మారింది. ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తే స్కూల్ అసిస్టెంట్లు.. హెచ్ఎంలు అవుతారు. వారికి ఉన్న స్కూళ్లను కేటాయించి, ఇప్పుడున్న హెచ్ఎంలను ఎంఈవోలుగా ప్రమోట్ చేయకుండా, ఎక్కడికి పంపుతారనే ప్రశ్న తెరమీదకొచ్చింది. కాబట్టి ఈ విషయంలో అంగీకారం వస్తేనే బదిలీలు, పదోన్నతుల అంశం ముందుకెళ్తుందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని సంఘాలు చెబుతున్నా, ముందస్తు ఎన్నికల భయం వారిని వెంటాడుతోంది. సెలవుల్లో టెన్త్ పేపర్ల మూల్యాంకన విధులుంటాయి. ఆ తర్వాత ఎన్నికల గంట మోగితే బదిలీలు, ప్రమోషన్లు లేనట్టేనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు, పదోన్నతులు రెండూ ఒకేసారి చేపట్టాలని, లేని పక్షంలో తమకు న్యాయం జరగదని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రాజాభాను చంద్రప్రకాశ్ చెప్పారు. -
టీచర్లందరికీ బదిలీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ బదిలీ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 317 జీవో ద్వారా కొంతకాలం క్రితం కొత్త జిల్లాలకు వెళ్లిన దాదాపు 25 వేలమంది టీచర్లు ఈ నెల 12 నుంచి 14 వరకూ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ గత నెల 27న విడుదలైంది. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూల్లో కనీసం రెండేళ్ల సర్వీసు ఉంటేనే బదిలీకి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో 59 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాలను డీఈవోలు పరిశీలించారు. సీనియారిటీ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే 317 జీవో ద్వారా బదిలీ అయి న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో బదిలీల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసును కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పైరవీ టీచర్లలో గుబులు బదిలీల్లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించుకుని అడ్డగోలుగా పైరవీ బేరాలు కుదుర్చుకున్న కొంత మంది టీచర్లలో తాజా పరిణామాలు గుబులు పుట్టిస్తున్నాయి. టీచర్లు లేదా వారి కుటుంబంలోని వారికి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సేవల కోసం కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకునే వెసులుబాటు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. వాస్తవానికి అనేక మంది ఈ కోటాను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అనారోగ్య కోటా కింద దరఖాస్తు చేసిన వారికి కూడా సీనియారిటీని బట్టి ప్రాధాన్యతనిస్తారు. ఈ ప్రక్రియలో కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లతో పైరవీలు చేయించుకున్నట్టు, దీని కోసం మధ్యవర్తులకు రూ. లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా 317 జీవో టీచర్లకు కూడా అనారోగ్య కోటా వర్తించనుంది. దీంతో ఈ కోటాలో తమ సీనియారిటీ మారుతుందేమోననే ఆందోళన పైరవీలు చేసుకున్న ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. అలా చేస్తే క్రెడిట్ మనకే వచ్చేదిగా.. బదిలీల మార్గదర్శకాల్లో జీరో సర్వీసు నిబంధన ఉండాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ పాఠశాల విద్యా డైరెక్టర్ ఇందుకు అడ్డుపడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం మంత్రి వద్ద మంగళవారం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మనమే జీరో సర్వీస్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అమలు చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం ఔదార్యంతో వ్యవహరించిందనే క్రెడిట్ రాదు కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
Telangana: అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకి సీనియర్, జూనియర్ లిస్టుల పేరుతో ఉపాధ్యా యులను కేటాయించింది. మొత్తం లక్ష 5 వేల మందిలో 25 వేల మంది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి బదిలీ అయ్యారు. మిగతా 80 వేల మంది పని చేసే చోటే మళ్ళీ పోస్టింగ్ పోందినారు. ఇప్పుడు అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి. నచ్చిన చోట ఖాళీ ఉంటే వెళ్ళే వెసులు బాటు ఇవ్వాలి. కొందరి లబ్ధి కోసం 317 జీవో అమలు చేసి మళ్ళీ ఇప్పడు వేరే జిల్లాలకి బదిలీ అయిన టీచర్లకు 2 సంవత్సరాల సర్వీస్ రూల్ ఉండాలనడం అర్థం లేని నిబంధన. ఇక 80 వేల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ కావడం జరుగుతోంది. కానీ టెట్ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన బ్యాచులవారూ మరో టెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్ పంపినారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరు కుంటున్నారు. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు -
Telangana: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదల కానుంది. షెడ్యూల్ వెలువడినప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు మాత్రం కొంత సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో అనేక సందేహాలు, ఆందోళనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపించే ముందుకెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పౌజ్ కేసులకు పరిష్కారం తీవ్ర వివాదం రేపుతున్న స్పౌజ్ కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు 2,100 మంది వరకూ ఉన్నారు. వీరంతా తమను ఒకే ప్రాంతానికి మార్చాలని ఆందోళనలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బదిలీల్లో 675 మందికి మాత్రమే అవకాశం కల్పించడంతో ఇటీవల పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,600 మందిని ప్రస్తుత బదిలీల్లో చేర్చి, ఇంకా మిగిలిన వారిని డిప్యుటేషన్ ద్వారా కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఖాళీలపై స్పష్టత ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలావుండగా హెచ్ఎంలు ఒకే స్థానంలో పని చేయడానికి సంబంధించిన కాలపరిమితిని 5 నుంచి 8 ఏళ్ళకు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టీచర్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై మిగతా వారిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డిమాండ్ల సాధనకు టీచర్ల ఆందోళనలు – ముందస్తుగా అదుపులోకి నేతలు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అమలు చేసిన 317 జీవో వివాదాస్పదంగా మారుతోంది. సీనియారిటీ లేకపోవడంతో స్థానికేతర జిల్లాలకు వెళ్ళిన టీచర్లు బదిలీలకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. బదిలీలకు కనీసం రెండేళ్ళ సర్వీస్ నిబంధన సరికాదంటున్నారు. జీరో సర్వీస్‌ను మార్గదర్శకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఆందోళనలు నిర్వహిస్తున్న 317 జీవో బాధిత ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి చేపట్టారు. ఇంకోవైపు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు (స్పౌజ్‌లు) ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని స్థానికేతర్లుగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి, వారు కోరుకున్న స్థానిక జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా బదిలీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. కాగా ఆందోళన చేస్తున్న స్పౌజ్ టీచర్లను ఉద్దేశించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ‘టీచర్లా–రౌడీలా’అంటూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు సదానందం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో బాధిత టీచర్లు పిలుపునిస్తే ఏ సంబంధం లేని యూఎస్పీసీ, డీటీఎఫ్ సంఘాల నేతలను అరెస్టు చేయడంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖాళీలు 21 వేలపైనే.. ప్రమోషన్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏలు) పదోన్నతులు పొందే వీలుంది. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1,944 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు. ఇప్పటికే ఖాళీగా ఉన్నవి, పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యేవి కలుపుకొంటే మొత్తం 7,111 వరకూ ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. వీటిల్లో ఎస్జీటీల ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా డీఎస్సీ ద్వారా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎస్జీటీ పోస్టులు 9 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు పొందే వారిని కలుపుకొంటే మరో 5 వేల వరకూ కొత్త ఖాళీలు ఏర్పడతాయి. ఇలా మొత్తంగా 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. -
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ పదోన్నతులకూ ఓకే
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంగళ, బుధవారాల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. విధి విధానాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మంత్రులు హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఆదివారం ఆయా సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం బదిలీలు, పదోన్నతులకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని, త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని సబిత తెలిపారు. కస్తూరీ బా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా ఇది అమలవుతుందని ఆమె చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ శుభవార్త చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం... ఇతర తరగతుల పరీక్షలు త్వరలో జరుగుతున్న కారణంగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ప్రకటించినా, ఏప్రిల్ తర్వాతే వీటిని అమలు చేస్తామని తెలిపారు. అయితే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి రెండో వారం కల్లా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమోషన్లు ఎంతమందికి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.05 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. వీటిల్లో 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో తెలిపింది. 317 జీవో అమలు తర్వాత దీనిపై స్పష్టమైన లెక్కలు తీయాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7111 ఖాళీలున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో 5 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు 2084 ఖాళీలున్నాయి. వీటిని ఎస్జీటీల ద్వారా భర్తీ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1948 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 9 వేల మందికిపై ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభిస్తాయి. కోర్టు వివాదాల తర్వాతే ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోల భర్తీ మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారులు, భాషా పండితుల అప్‌గ్రేడ్ వ్యవహారం చేపట్టేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. రాష్ట్రంలో 443 ఎంఈవో పోస్టులున్నాయి. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఎంఈవోలు 21 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవో పోస్టులు 78 ఉంటే 18 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఎంఈవో పోస్టులను నేరుగా ఎంపికైన ప్రభుత్వ హెచ్ఎంల ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల పాఠశాలలకూ ఈ అవకాశం ఇవ్వాలని మరికొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. భాషా పండితుల విషయం కూడా న్యాయస్థానంలో ఉంది. ఈ కారణంగా కోర్టు వివాదం ముగిసిన తర్వాతే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల కోసమేనా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చిలో ఈ ఎన్నిక జరిగే వీలుంది. మరోవైపు సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 317 జీవో కారణంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 2015లో ప్రమో షన్లు, బదిలీలు చేపట్టారు. 2017లో మరోసారి బదిలీలు మాత్రమే జరిగాయి. అప్పట్నుంచి బది లీలు, పదోన్నతులు లేవు. ఈ ప్రభావం ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికలపై ఉంటుందని ప్రభుత్వం సందేహిస్తోందని, అందుకే హడావుడిగా ఉపాధ్యా యవర్గాలను ఆకర్షించేందుకు ప్రకటన చేశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిష్కరించలేదని, ఇప్పుడు బదిలీలు ఎలా చేపడతారని మరికొంతమంది అంటున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయం మంచిదే. దీంతో పాటు స్కూళ్ళలో అన్ని స్థాయి ల్లో ఖాళీలు భర్తీ చేయాలి.. అప్పుడే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షక పోస్టులను విస్మరించకూడదు. – పి రాజభాను చంద్ర ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు మంచి నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలకు ఈ తరహా తీపి కబురు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే నిర్ణయం సమర్థనీయం. – బీరెల్లి కమలాకర్, పింగిలి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ నేతలు) -
త్వరలోనే టీచర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు యాజమా న్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి పదోన్నతులు, బదిలీ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్టు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన పీఆర్టీయూటీఎస్ 2023 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను సంక్రాంతి కానుకగా అందించాలని తాను సీఎం కేసీఆర్‌ను కోరగా, సానుకూలంగా స్పందించా రన్నారు కార్యక్రమంలో పీఆర్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నేతలు మధు, రంగారావు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరావు, రవి, ప్రసాద్ పాల్గొన్నారు -
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి: ఎస్టీయూటీఎస్
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని, వేతనేతర, మెడికల్ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపాధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు. -
షెడ్యూల్ ఇవ్వకుండానే.. సైలెంట్‌గా టీచర్ల పదోన్నతుల జాబితాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులపై మళ్లీ కదలిక వచ్చింది. సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు సీనియారిటీ ప్రాతిపదికన జాబితాలు సిద్ధం చేస్తున్నారు. వాటిని అనధికారికంగా ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్‌లకు పంపి.. డ్రాఫ్ట్ (ముసాయిదా జాబితా)గా భావించాలని చెప్తున్నారు. అయితే ఈ పదోన్నతుల జాబితాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లు, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ) మాత్రమే ఉండటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. షెడ్యూల్ విడుదల చేయకుండానే ముసాయిదా సీనియారిటీ జాబితాలు రూపొందించడం ఏమిటని.. అందరికీ పదోన్నతులు ఇవ్వడంపై విద్యాశాఖ ఎందుకు దృష్టిపెట్టడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఉన్న చిక్కులన్నీ పరిష్కరించాలని కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆందోళనబాట పట్టాలని పలు సంఘాలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పర్యవేక్షణ పోస్టులు లేనట్టేనా? రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లున్నారు. ఇందులో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదో న్నతి పొందాల్సినవారు 8,500 మంది ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్(హెచ్ఎం) గా ప్రమోషన్ పొందాల్సినవారు 2 వేలకుపైగా ఉం టారు. వీరికి పదోన్నతులు కల్పించడంపై ఎలాంటి చిక్కులూ లేవని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే హెచ్ఎంల నుంచి ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు కల్పించడమే సమస్య అంటున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఉన్న టీచర్లకూ ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులు ఇవ్వాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు నిబంధనల ప్రకారం విద్యాశాఖ నేరుగా రిక్రూ ట్చేసుకున్న ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకే ఆ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సం ఘం స్పష్టంచేస్తోంది. దీనిపై విద్యామంత్రి వద్ద రెండుసార్లు చర్చలు జరిగాయి. అయినా ఏమీ తేల లేదు. ఈ కారణంతో ప్రస్తుతం హెచ్ఎంలకు పదో న్నతులు కల్పించే అవకాశం లేదని భావిస్తున్నారు. జాబితాలు అందరికీ పంపాలి షెడ్యూల్ ఇవ్వకుండానే పదోన్నతులకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయడం సరికాదు. టీచర్లు అందరికీ జాబితాలు పంపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముందు పదోన్నతులు, బదిలీలకు ఉన్న కోర్టు చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. –చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎంల పదోన్నతులూ ముఖ్యమే రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యావ్యవస్థ సక్రమంగా పనిచేయడం కష్టం. సాకులు చూపి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం సరికాదు. ప్రధానోపాధ్యాయులు ఎంతోకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా వాయిదా వేస్తే వారిలో సహనం నశిస్తుంది. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బదిలీలకూ సమస్యే.. పదోన్నతులు, బదిలీలను ఏకకాలంలో చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అన్నిస్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే తప్ప బదిలీలు చేయడం సాధ్యమయ్యే పనికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఆ తర్వాత ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని.. ఏప్రిల్ నెలాఖరుకే ఈ మేరకు షెడ్యూల్ ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. కానీ ఈ ప్రక్రియకు ఏదో అడ్డంకి వస్తుండటంతో.. ప్రస్తుతం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఇలాగైతే బదిలీలు ఎప్పుడు చేపడతారని, ఎలా చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌లో బడుల రీఓపెనింగ్ ఉంటుందని... ఇప్పటికీ పదోన్నతులపై స్పష్టత ఇవ్వకుండా, కోర్టు వివాదాలు, ఇతర సమస్యలను తేల్చకుండా బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే 317 జీవోకు సంబంధించి 6 వేల అప్పీళ్లు విద్యాశాఖ ముందున్నాయని.. స్పౌజ్ కేసులను పరిష్కరించలేదని గుర్తు చేస్తున్నాయి. -
దసరాలోపు టీచర్ల పదోన్నతులు
సాక్షి, అమరావతి: దసరా పండుగలోపు విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆర్సీ నంబర్ 13021 విడుదల చేశారు. విద్యాశాఖలో గతంలో టీచర్లకు నెలవారీ పదోన్నతులు అమలు చేసేవారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కొంత కాలంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్లను ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను తయారు చేసి ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ నుంచి హైస్కూల్ హెచ్ఎం వరకూ ప్రమోషన్లు అమలు చేసేందుకు సంబంధిత ఆర్జేడీ, డీఈవోలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియను దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర్వుల పట్ల ఆయా టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట..
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత పాత జిల్లా ప్రాతిపదికనా.. లేక కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలా అనే సందిగ్ధంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా పైస్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కిందిస్థాయి టీచర్లకు పదోన్నతులు రావ డం లేదు. ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతులు సమర్పించాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి సబితా రెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పదోన్నతుల అంశాన్ని సులభంగా పరిష్కరించేలా చూడాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పాత పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని విద్యా శాఖాధికారులు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు అనుమతికి చర్యలు... నూతన జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని కోర్టు గతంలో స్పష్టం చేసింది. గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల సమయంలో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. నూతన జిల్లా ప్రాతిపదికన బది లీలు చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలు కాగా... వాటిని విచారించిన కోర్టు పాత జిల్లా ప్రాతిపదికన బదిలీలు, కొత్త జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టవచ్చని సూచించింది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిని పరిగణిస్తూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయగా, పదోన్నతుల అంశం మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో టీచర్ల బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పరిష్కార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలంటే ఉద్యోగుల విభజన జరగలేదనే అంశం ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ప్రమోషన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశిస్తూనే... కోర్టు అనుమతి కోసం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. స్కూల్ అసిస్టెంట్ వరకే... తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టాల్సివస్తే కేవలం ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు మాత్రమే పదోన్నతులు ఇచ్చే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం (గెజిటెడ్ హెడ్మాస్టర్) పదోన్నతుల్లో జోనల్ సమస్య ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టు జోనల్ పరిధిలో ఉండడం, తాజాగా నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఏ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఎంఈఓ, డిప్యూటీ ఈవో పదోన్నతులపైనా జోనల్ అంశంతో పాటు సర్వీసు రూల్స్‌తో ముడిపడి ఉంది. దీంతో ఈ పోస్టులకు పదోన్నతులు ఇవ్వడం ప్రస్తుతానికి కష్టమనే చెప్పొచ్చు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో రాష్ట్రవ్యాప్తంగా 6,500 పోస్టులు భర్తీ చేసే వీలున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. -
ఉపాధ్యాయుల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్
ఉపాధ్యాయుల నాలుగేళ్ల కల సాకారం కానుంది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే టీచర్ల పదోన్నతుల ఫైల్లో కదలిక వచ్చింది. జిల్లాలో పదోన్నతులకు అర్హులుగా ఉన్న వారి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు పంపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: నాలుగేళ్లుగా ముందుకు సాగని ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంలో కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు రాష్ట్రస్థాయి అధికారులకు చేరాయి. జిల్లాలో 4,758 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 3,693, ప్రాథమికోన్నత పాఠశాలలు 438, ఉన్నత పాఠశాలలు 627 ఉన్నాయి. ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత నాలుగు సంవత్సరాలుగా పదోన్నతులు లేక అదే పోస్టులో కొనసాగాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం పదోన్నతులు సకాలంలో నిర్వహించకపోవడంతో చాలామంది ఉన్న స్థానంలోనే పదవీ విరమణ పొందాల్సిన దుస్థితి. దీంతో చాలామంది నష్టపోయారు. ప్రతి ఏటా పదోన్నతులు నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ గత పాలకుల అలసత్వంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయ్యోర్లకు సంవత్సరాలుగా కలగా ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. జిల్లాలో నాలుగేళ్లుగా పదోన్నతుల ఫైల్‌కు పట్టిన బూజును జిల్లా విద్యాశాఖాధికారులు దులిపారు. కసరత్తు నిర్వహించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన వారిని కేడర్ల వారీగా గుర్తించి ప్రాథమికంగా నివేదికలు తయారు చేశారు. ఆ నివేదికలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు చేరవేశారు. 691 మందికి పదోన్నతులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 691 మంది ఉపాధ్యాయులకు త్వరలో పదోన్నతులు కల్పించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఆ నివేదికల ప్రకారం జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 114 మంది, స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)–53, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు మీడియం గణితం)– 37, ఉర్దూ మీడియం గణితం – 02, తమిళ మీడియం గణితంలో – 02, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (తెలుగు మీడియం) – 19, ఉర్దూ మీడియం ఫిజికల్ సైన్స్– 04, తమిళ మీడియం ఫిజికల్ సైన్స్ –02, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం బయాలజికల్ సైన్స్ –56, ఉర్దూ మీడియం –01, తమిళ మీడియం –03, స్కూల్ అసిస్టెంట్ సోషియల్ తెలుగుమీడియం – 167, ఉర్ధూ మీడియం –01, తమిళ మీడియం– 04, స్కూల్ అసిస్టెంట్ తెలుగు –44, స్కూల్ అసిస్టెంట్ హిందీ– 17, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ –06, స్కూల్ అసిస్టెంట్ తమిళం –02, స్కూల్ అసిస్టెంట్ తెలుగుమీడియం ఫిజికల్ ఎడ్యుకేషన్ – 19, ఉర్దూ మీడియంలో –01, తమిళ మీడియం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం –01, తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు– 135, ఉర్ధూ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు –02 మొత్తం 691 మందికి పదోన్నతులు కలగనున్నాయి. త్వరలో మార్గదర్శకాలు పదోన్నతులకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయంలో పదోన్నతుల ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. పదోన్నతులకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కేడర్ల వారీగా పదోన్నతులు కల్పించి నియామక పత్రాలను అందజేస్తారు. గత నాలుగు సంవత్సరాల తర్వాత నూనత ప్రభుత్వంలో పదోన్నతులు వస్తుండడంతో ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కృతజ్ణతలు తెలుపుతున్నారు. -
టీచర్ల పదోన్నతులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులపై తీవ్ర గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఏకీకృత సర్వీసు రూల్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో పదోన్నతుల అంశాన్ని ఉపాధ్యాయ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. పదోన్నతి ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘ఏకీకృతం’అంశం కోర్టు పరిధిలో ఉండటంతో పదో న్నతుల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు అంశాన్ని సాకుగా చూపుతూ బదిలీలే చేపట్టింది. కోర్టు తీర్పు తో స్పష్టత వచ్చినందున పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. పాత విధానంతోనే.. ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటివరకు పదోన్నతులు చేపట్టకుంటే విద్యాశాఖలో మరింత ఆటుపోట్లు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఈవో, ఉపవిద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ అగమ్యగోచరంగా మారింది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నా అకడమిక్ కార్యక్రమాలు, పరిపాలన అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. ‘ఏకీకృతం’విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొస్తుందని భావించిన విద్యాశాఖ 4ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టలేదు. తాజా హైకోర్టు తీర్పులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. యాజమాన్యాల వారీగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు చేపడితే సరిపోతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెం ట్లు, జీహెచ్ఎం కేటగిరీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు అనుకూలంగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనే అంశంపై మరోకేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ కేటగిరీల్లో పదోన్నతులు సులభతరమైనా ఎమ్ఈవో,డైట్ లెక్చరర్ తదితర పోస్టుల్లో చిక్కులు తప్పవని తెలుస్తోంది. -
టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ఎదురుచూస్తున్న హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్), పదోన్నతులు, బదిలీలకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ ప్రక్రియకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలి పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులతో సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు అంగీకరించారు. ఈ విషయాన్ని కడియం శ్రీహరి విలేకరులకు వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను 8వ తేదీన (సోమవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీచర్ల బదిలీల విషయంలో విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. టీచర్ల పదోన్నతుల అంశం ఆర్థిక పరిస్థితులతో ముడిపడిన అంశమని సీఎం పేర్కొనగా పెద్ద భారం ఉండబోదని అధికారులు చెప్పడంతో కేసీఆర్ ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం విద్యార్థులు లేకున్నా టీచర్లున్న స్కూళ్లు 4 వేల వరకు ఉన్నా యి. ఇక విద్యార్థులున్నా టీచర్లు లేని స్కూళ్లు కూడా వేలసంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులున్న చోటుకు టీచర్లను పంపేందుకు చర్యలు చేపట్టనున్నారు. త్వరలోబదిలీలకు మార్గదర్శకాలు జారీ రేషనలైజేషన్‌తోపాటు టీచర్ల పద్నోతులు, బది లీలకు కూడా మార్గదర్శకాలు, అవసరమైన ఉత్తర్వులు కూడా సోమవారం జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సీఎం ఆమోదం నేపథ్యంలో ఉత్తర్వులను అధికారులు వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించి, బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలు చేపట్టాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ బది లీలపై నిషేధాన్ని సడలించాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ సోమవారం లేదా మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవో నంబర్ 6కు సవరణలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 6కు సవరణలు చేయనున్నారు. ఆ జీవో ప్రకారం 19, అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక స్కూళ్లను, 75, అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను సమీపంలోని స్కూళ్లలో విలీనం చేయాలి. ఆ నిబంధనను తొలగించకపోతే ఆయా స్కూళ్లు మూతపడటంతోపాటు అందులోని టీచర్ల పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ నిబంధనకు సవరణలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, స్కూళ్లను మూసివేయకుండా అవసరమైన మార్పులు చేయాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 2013 నాటి బదిలీలపైనా రానున్న స్పష్టత టీచర్ల బదిలీల్లో భాగంగా 2013లో బదిలీ అయినా ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయుల వ్యవహారంపైనా సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారు అప్పట్లో బదిలీ అయిన స్థానాలకు ఇప్పుడు పంపిస్తారా? లేదా వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారికి తాజా బదిలీల్లో అవకాశం కల్పిస్తారా? అన్న విషయంలోనూ స్పష్టత రానుంది.