
సాక్షి, అమరావతి: దసరా పండుగలోపు విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆర్‌సీ నంబర్ 13021 విడుదల చేశారు. విద్యాశాఖలో గతంలో టీచర్లకు నెలవారీ పదోన్నతులు అమలు చేసేవారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కొంత కాలంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్లను ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను తయారు చేసి ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ నుంచి హైస్కూల్ హెచ్‌ఎం వరకూ ప్రమోషన్లు అమలు చేసేందుకు సంబంధిత ఆర్జేడీ, డీఈవోలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియను దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర్వుల పట్ల ఆయా టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు)
Comments
Please login to add a commentAdd a comment