తాడేపల్లి: పీఆర్సీ అంశానికి సంబంధించి ఈరోజు (మంగళవారం) కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మరోసారి చర్చ జరిగినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫైనాన్స్ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్ ముందు ఉంచారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్నారు. ఫిట్‌మెంట్, డీఏలు అన్నీ చర్చిస్తున్నారని, ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టే కొంచెం ఆలస్యమవుతోందని సజ్జల తెలిపారు. త్వరలోనే పీఆర్సీపై సీఎం ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు.
బీజేపీ దీక్ష చేయడం వెనుక టీడీపీ భావజాలమే
ఇక బీజేపీ దీక్ష చేయడం వెనుక టీడీపీ భావజాలమే ఉందని సజ్జల విమర్శించారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులను బీజేపీ, జనసేన లాంటి పార్టీల్లోకి చంద్రబాబు జొప్పించాడన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా ఆగ్రహం ఉందని సజ్జల ప్రశ్నించారు. వాళ్లు రామరాజ్యం తీసుకురావడం కాదు.. ఆల్‌రెడీ రాష్ట్రంలో రామ రాజ్యం నడుస్తోందన్న సజ్జల.. రాజన్న రాజ్యం అంటే రామ రాజ్యమే అని స్పష్టం చేశారు. ఉదయం టీడీపీ మాట్లాడిందే.. రాత్రికి మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయని, వీళ్లందరిదీ ఒకటే స్టాండ్ అని, అది చంద్రబాబు స్టాండ్ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment