సాక్షి, ఒంగోలు: జేఏసీ పేరుతో బండి శ్రీనివాసరావు, బొప్పారాజు వెంకటేశ్వర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వినుకొండ రాజారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఆర్సీ 10 రోజుల్లో ఇస్తానని చెప్పినా వినకుండా ప్రభుత్వాన్ని కూలుస్తాము, పేలుస్తాము అంటూ మాట్లాడటంలో అంతర్యమేమిటి అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడే జేఏసీ నేతల వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంతో అంట కాగిన ఈ నేతలు, మళ్లీ అదే ప్రభుత్వం వస్తే బెర్త్‌లు కోసం పాకులాడుతున్నట్టుగా ఉందని రాజారావు ఆరోపించారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమన్న విషయాన్ని మర్చిపోయి పరిధిదాటి మాట్లాడుతున్నారని వినుకొండ రాజారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ('రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి')
సీఎం జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది
విశాఖపట్నం: బొప్పరాజు, బండి శ్రీనివాస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ మండిపడింది. 'వారివురు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో మేము పాల్గొనం. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ పీఆర్సీపై ప్రకటన చేసిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అర్థం లేదు. సీఎంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. సీఎం జగన్ ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తారు' అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment