సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలను అనేక సార్లు చర్చలకు పిలిచామని తెలిపారు. సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మేరకు మంచి నిర్ణయం తీసుకున్నామని సజ్జల పేర్కొన్నారు.
చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’
‘‘పీఆర్సీ నిర్ణయం గురించి అన్నీ వివరించాం. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగింది. బల ప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుంది. పీఆర్సీ ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇస్తున్నాం. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిందంతా చేశాం. ఉపాధ్యాయులకు చాలా మేలు చేశాం. సర్వీస్ సంబంధిత అంశాలెన్నింటినో పరిష్కరించామని ’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment