మాట్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్
తిరుపతి కల్చరల్: ఉద్యోగుల శ్రేయస్సు కోసం మేలైన పీఆర్‌సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్ చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఆర్‌సీ అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నారని, ఉద్యోగులకు మేలైన పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ కల్పిస్తూ ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే రెండు సంఘాల నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేయడం విడ్డూరమన్నారు.
విమర్శలు మానకుంటే ఆ సంఘాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 30 నుంచి 34 శాతం మధ్య ఫిట్‌మెంట్‌తో న్యాయం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాడర్‌ను బట్టి మినిమం పే స్కేల్ వర్తించే విధంగా కృషిచేస్తామని, ప్రభుత్వ పరిధిలోని ప్రతి ఉద్యోగికి హెల్త్ స్కీమ్ వర్తించేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు అర్జున్, రీటా, నరసింహయ్య, శ్రీనివాసులు, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment