
సాక్షి, అమరావతి: పీఆర్సీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ కమిటీని అధికారిక కమిటీ కాదనడం సరైనది కాదన్నారు.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలకు ఆహ్వానం పంపాక అధికారికం కాకుండా ఎలా ఉంటుందని బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని బొత్స తెలిపారు. కాగా, జీఏడీ ప్రిన్పిపల్ సెక్రటరీ శశిభూషణ్‌ను ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇచ్చాయి.
ఇక్కడ చదవండి: ‘ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’
Comments
Please login to add a commentAdd a comment