
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఐఆర్ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు.
చదవండి: కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్