IR
-
త్వరలో పీఆర్సీ, ఐఆర్‌పై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రెండో వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి మధ్యంతర భృతిని ప్రకటించా లని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమి టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి.మమత తదితరు లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తాము సమర్పించిన వినతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మామిళ్ల రాజేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో టీజీఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీఎన్జీఓల యూనియన్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణగౌడ్ ఉన్నారు. -
అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి
-
సీఎం జగన్ గారిది పెద్ద చేయి.. ఆయనను చూసి మాకు చాలా బాధేసింది: వెంకటరామిరెడ్డి
-
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇవే: సూర్యనారాయణ
-
సీఎం జగన్ మాటలతో సంతోషంగా ఉన్నాం: బండి శ్రీనివాసరావు
-
ఉద్యోగుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఐఆర్ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు. చదవండి: కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్ -
ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ చెప్పారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఐఆర్‌గా ఉద్యోగులకు రూ.15,839.99 కోట్లు అందజేశామని చెప్పారు. శుక్రవారం శాసన మండలిలో ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. కోవిడ్ సమయంలో ఉపాధి, ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని కూడా దశలవారీగా ఇస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడమే కాకుండా 1.30 లక్షల మంది గ్రామ/వార్డు కార్యదర్శులను నియమించామన్నారు. మరో 23,000 ప్రభుత్వ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. సీపీఎస్ రద్దుపై కమిటీలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది: విఠాపు బాలసుబ్రమణ్యం అంతకుముందు పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుందని అన్నారు. అందువల్లే కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టకున్నామన్నారు. అందుకు తగినట్టుగానే ఈ ప్రభుత్వం మొదట్లో ఐఆర్ బాగా ఇవ్వడంతో సంతోషించామన్నారు. కానీ సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల పెండింగ్ వంటి ప్రధాన విషయాలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు కూడా స్పందించడంలేదని, మీరైనా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పి చెప్పి అలసిపోయామని, రాష్ట్రంలో ఉన్న పది లక్షలకుపైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి పోరాటాలు చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'ఏపీలో మాదిరిగా ఐఆర్ ప్రకటించాలి'
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో పీఆర్సీ ఇచ్చే వరకు ఐఆర్ ఇచ్చేవారని, ఆగస్టులోనే పీఆర్సీ నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం మూడు డీఏలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ఇచ్చిందన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉందని, పక్క రాష్ట్రం 27 శాతం ఐఆర్ ఇస్తుందని పేర్కొన్నారు. 'తెలంగాణ వచ్చాక పదోన్నతులు, కొత్త నియామకాలు లేవు. లక్షా 35 వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు..ఎప్పుడు భర్తీ చేస్తారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సహా ఉద్యోగస్తులకు రావాల్సిన ఒక్క బెనిఫిట్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు' అని రామచందర్ రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. (కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి ) -
‘రిటైర్మెంట్’ పెంపు.. ఐఆర్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే మంత్రివర్గ భేటీలో వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వం భారీ అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరి 22న చివరిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో దాదాపు 9 నెలలుగా రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. పలు కీలక అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. తాజాగా మంగళవారం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం ముందు పెండింగ్ ప్రతిపాదనలతోపాటు కొత్త ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డజనుకుపైగా అంశాలను ప్రభుత్వం మంత్రివర్గం ముందు ఉంచబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం పెంపు, ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో టీఎంసీ నీరు తరలింపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ తదితర ప్రధాన అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 22 కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్ ముందుంచనుంది. అలాగే రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన పూర్తికాకపోవడంతో ఈ కేబినెట్ సమావేశంలో పెట్టే అవకాశం లేకుండా పోయింది. కొత్త మున్సిపల్ చట్టం సిద్ధమైనా మంత్రివర్గ సమావేశంలో పెట్టడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో పిలుపు వస్తే కొత్త మున్సిపల్ చట్టాలను కేబినెట్ ముందు ఉంచి ఆమోదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ కేబినెట్ ఎజెండాలో ఉండబోతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన! ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం మంత్రివర్గ సమవేశంలో చర్చించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలా లేక ఫిట్మెంట్ వర్తింపజేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రివర్గం సమావేశమై అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టి మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీపై కేంద్రీకృతమై ఉంది. మధ్యంతర భృతితోపాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశముందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటన/పీఆర్సీ అమలులో జాప్యంపట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల జేఏసీ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై మంత్రివర్గంలో తప్పకుండా చర్చించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మధ్యంతర భృతి చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
18న ఐఆర్ ప్రకటన!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మధ్యంతర భృతి చెల్లింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుపుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 18న మంగళవారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం ఐఆర్‌పై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించా లా లేక ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఐఆర్ చెల్లింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేశారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఆర్ చెల్లింపునకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని ఎంత శాతం మేరకు ఐఆర్ ప్రకటించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలో 27శాతం ఐఆర్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో అంతకు మించి ప్రకటించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. వాస్తవానికి 2018 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఆర్ ప్రకటిస్తామని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. దీనికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే 2018 జూన్ 1న ఐఆర్ ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్, సభ్యులతో సీఎం కేసీఆర్ సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ నివేదిక సమర్పించడానికి ముందే ఐఆర్ ప్రకటించడం సరికాదనే అభిప్రాయం రావడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఉద్యోగులకు ఐఆర్ చెల్లించడానికి వీలుగా వెంటనే నివేదిక సమర్పించాలని అప్పట్లో పీఆర్సీ చైర్మన్, సభ్యులను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ఒక శాతం ఐఆర్ చెల్లిస్తే ఏడాదికి రూ. 300 కోట్లు, 10 శాతం ఇస్తే రూ. 3,000 కోట్లు, 20 శాతం ఇస్తే రూ.6,000 కోట్ల వ్యయం కానుందని అప్పట్లో ఆర్థికశాఖ అధికారులు సీఎంకు నివేదించారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 27శాతం ఐఆర్ ప్రకటిస్తే ఏటా ప్రభుత్వంపై రూ. 8,100 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉందని, ఆదాయం సమృద్ధిగా పెరుగుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల సచివాలయంలో మీడియాకు తెలిపారు. దీంతో ఐఆర్ ప్రకటన రావచ్చని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఆలస్యం? రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో మహమ్మద్ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావుతో 2018 మే 18న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు చేసింది. 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. 9 నెలలుగా రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో ఐఆర్, వేతన సవరణ అంశాలు మరుగునపడ్డాయి. దీంతో పీఆర్సీ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం వరుసగా పొడిగించాల్సి వచ్చింది. ఎన్నికలన్నీ ముగియడంతో ప్రభుత్వం మళ్లీ పీఆర్సీ నివేదికపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం ఐఆర్ చెల్లింపునకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. 2018 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. తక్షణమే 43 శాతం ఐఆర్ ప్రకటించి గత జూలై నుంచి రావాల్సిన బకాయిలతో సహా చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వర్కర్ల జేఏసీ తాజాగా డిమాండ్ చేసింది. పరిశీలనలో రిటైర్మెంట్ వయసు పెంపు! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగిస్తామని గత డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ మధ్యంతర ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఎస్ రద్దు చేయాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో సైతం సీపీఎస్ రద్దు అంశాన్ని కేబినెట్ భేటీలో పరిశీలించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ వరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్ హాల్లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు. 27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారని, గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నవాళ్లను తాను తప్పుపట్టనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదవండి...మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్ అంతకు ముందు సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు శఠగోపం!
-
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
పీఆర్సీ అమలు గతేడాది నుంచే
హైదరాబాద్: పదవ వేతన సవరణ సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోననే ఉద్యోగుల ఉత్కంఠకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఉద్యోగులకు పదవ వేతన సవరణ సంఘం సిఫార్సులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉద్యోగుల డీఏ, మధ్యంతర భృతి(ఐఆర్), పీఆర్సీ అమలుతోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ వ్యయం పెరిగిందని నివేదికలో తెలియజేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో.. సీమాంధ్రకు సంబంధించి అయిన రెవెన్యూ వ్యయం రూ.50,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యయం రూ.78,977 కోట్లకు పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీతోపాటు కార్యాలయ ఖర్చులు, అద్దెలు పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. భారీ రెవెన్యూ వ్యయానికి కారణంగా ఈ దిగువ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల డీఏ, కార్యాలయ ఖర్చుల పెంపు, అద్దెలకు- రూ.8,117 కోట్లు అనివార్య ఖర్చులను ప్రణాళికేతరానికి మార్చడం- రూ.6,065 కోట్లు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు ప్రభావం- రూ.2,569 కోట్లు 2013-14 నుంచి పీఆర్సీ అమలు కారణంగా- రూ.3,111 కోట్లు మొత్తం- రూ.19,862 కోట్లు -
మధ్యంతర..తిరస్కృతి!
-
మధ్యంతర..తిరస్కృతి!
పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్‌పై మెలిక మధ్యంతర భృతి ఇవ్వాలంటూనే.. అనేక షరతులు చంద్రబాబు బాటలో కిరణ్ సర్కారు 80 వేల మంది ఉద్యోగులకు అన్యాయం సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే! ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ గురువారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ సంబంధిత విభాగాలకు పంపిన ఉత్తర్వుల్లో (యూవో నోట్ నం. 29/4/ఏ2/పీసీజే/2014) మార్గదర్శకాల పేరిట ఆచరణ సాధ్యంకాని నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మొండిచెయ్యి చూపిన విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గత తొమ్మిది పీఆర్సీల్లో డీఏ, ఐఆర్ అందుకుంటున్నామని, ఇప్పుడు కూడా ఇవ్వాలంటూ ఐఆర్ రాని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. గతంలో అనుసరించిన విధంగానే అందరికీ ఐఆర్ మంజూరు చేయడానికి వీలుగా ఉత్తర్వులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా ఉత్తర్వులు వచ్చాయి. అది కూడా జీవో రూపంలో కాకుండా యూవో నోట్‌తో ప్రభుత్వం సరిపెట్టింది. దీనివల్ల సుమారు 80 వేల మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ని‘బంధనాలు’ ఇవీ.. ఐఆర్ మంజూరుకు అనుసరించాల్సిన 8 మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో సూచించారు. 6 మార్గదర్శకాలు గతంలో ఉన్నవే. ఆయా సంస్థల పాలకమండళ్లకు ఐఆర్ మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి మిగతా రెండు నిబంధనలు దోహదపడనున్నాయి. ప్రతి సంస్థ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలను పరిశీలించి ఐఆర్ ఇవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకొనే అధికారాన్ని ప్రభుత్వరంగ సంస్థల శాఖకు అప్పగించడం.. ఒక నిబంధన కాగా, ఆర్థిక శాఖ అనుమతి తర్వాతే ఐఆర్ మంజూరు అమలు చేయాలని షరతు విధించడం రెండో నిబంధన. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకు నిర్ణయాధికారం లేకుండా చేయడం ద్వారా ఐఆర్ మంజూరులో తీవ్ర జాప్యం చేయడానికి, నిబంధనల సాకుతో అసలు ఇవ్వకుండా ఉండటానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని పీఎస్‌యూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తప్పుబట్టారు. వైఎస్ ఇచ్చారు... 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొమ్మిదో పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 22 శాతం ఐఆర్ ఇచ్చారు. ఈమేరకు 2008 అక్టోబర్ 15న 303 జీవో జారీ చేశారు. అందులో పేరా-2(హెచ్)లో ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాల ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయడానికి అవకాశం ఇస్తూ స్పష్టంగా పేర్కొన్నారు. పీఎస్‌యూ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించదంటూ 1999లో చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగొచ్చి తర్వాత మంజూరు చేసింది. ఇప్పుడు బాబు బాటలో కిరణ్ కుమార్‌రెడ్డి కూడా ప్రయాణిస్తున్నారు. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కిరణ్ సర్కార్ మొండిచెయ్యి
వారికి ఐఆర్ వర్తించదని జీవోలో స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి(ఐఆర్) విషయంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోలో.. ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. దీంతో వేలాదిమంది పీఎస్‌యూ ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదా అని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా వేతన సవరణ సంఘాలు(పీఆర్సీలు) లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పీఆర్సీలనే పీఎస్‌యూలు నేరుగా అమలు చేస్తున్నాయి. అదేరీతిలో డీఏ, ఐఆర్ విషయంలోనూ అనుసరిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు ఐఆర్ మంజూరు ఉత్తర్వుల్ని అమలు చేసుకునే అవకాశమివ్వడం సంప్రదాయంగా కూడా వస్తోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు 22 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు తమ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయడానికి అవకాశమిస్తూ జీవోలో స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీరం చేసిన చంద్రబాబు మాత్రం పీఎస్‌యూ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించదంటూ 1999(ఏడో పీఆర్సీ సమయం)లో ఉత్తర్వులి చ్చారు. ఇప్పుడదే బాటలో కిరణ్‌కుమార్‌రెడ్డి పయనించారు. పీఎస్‌యూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని పీఎస్‌యూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కాంట్రాక్టు’ రద్దుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయడానికి సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నెల 9న జరిగే పాలకమండలి సమావేశంలో ఈమేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు తెలిపింది. అయితే ప్రభుత్వం అనుమతించిన మేరకు 24,577 మందిని ఒకే విడతలో క్రమబద్ధీకరించడానికి మాత్రం నిరాకరించింది. తొలి విడతలో 3,954 మంది డ్రైవర్లు, 5,564 మంది కండక్టర్లు కలిపి మొత్తం 9,518 మంది కాంట్రాక్టు సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించడానికి అంగీకరించింది. వీరికి ఫిబ్రవరి 1న రెగ్యులర్ సిబ్బందికి ఇచ్చే విధంగా జీతాలు చెల్లించనున్నారు. సోమవారం కార్మిక శాఖ కమిషనర్ వద్ద కార్మిక సంఘాలకు, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకూ ఐఆర్ ఇవ్వాలన్న ఈయూ, టీఎంయూ డిమాండ్‌పై యాజ మాన్యం సానుకూలంగా స్పందించలేదు. యాజమాన్య ధోరణికి నిరసనగా ఈ నెలలో ఏ రోజైనా మెరుపు సమ్మెకు దిగుతామని ఈయూ, టీఎంయూ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను ఒకేసారి కాకుండా దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామని యాజమాన్యం చెప్పడంతో నిరసనగా ఎన్ఎంయూ నేతలు చర్చల నుంచి బయటకువచ్చారు. -
22% ఇస్తాం.. 32% ఇవ్వాల్సిందే..
ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఐఆర్‌పై తేలని చర్చ అవసరమైతే ఆందోళన చేపడతామని ఉద్యోగుల హెచ్చరిక ఆర్థిక మంత్రి వద్ద అసంపూర్తిగా ముగిసిన చర్చలు నేడు ఉదయం సీఎం వద్ద సమావేశం.. 22 శాతం ఇచ్చినా ఖజానాపై రూ. 6,259 కోట్లు భారం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉద్యోగ సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. ‘‘నేను సున్నా నుంచి ప్రారంభించలేదు. 17 శాతం ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది. దానికి అంగీకరించండి’’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. చివరికి.. 22 శాతం ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు. అంతకు మించి ఇచ్చే అధికారం ఆర్థిక మంత్రిగా తనకు లేదని.. ముఖ్యమంత్రి సమక్షంలోనే తేల్చుకోవాలని సూచించారు. 22 శాతం ఐఆర్ ఇచ్చినా.. రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 6,259 కోట్ల భారం పడుతుందని ఆనం తెలిపారు. అయితే తొలుత 45 నుంచి 50 శాతం ఐఆర్ ఇవ్వాల్సిందేనని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. చర్చల సందర్భంగా కాస్త మెత్తబడి 32 శాతానికి దిగాయి. కానీ, అంతకన్నా తక్కువగా ఇస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పడంతో.. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఐఆర్‌పై చర్చ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగనున్నాయి. ఇందులో తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. నూతన సంవత్సర కానుకగా ఐఆర్ ఇస్తామని గత వారమే ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. కానీ ఐఆర్ ప్రకటన రాకుండానే ఉద్యోగులు నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు. గురువారం జరిగే చర్చల్లోనైనా ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా ఐఆర్ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ 32 శాతానికి ప్రభుత్వం అంగీకరించకుంటే.. ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. -
ఐఆర్‌పై నిర్ణయం వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి(ఐఆర్)పై ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురయింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఐఆర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులు ఎంతమేర ఐఆర్ కోరుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికే సీఎం పరిమితమయ్యారు. అయితే కొత్త సంవత్సర కానుకగా రెండు, మూడు రోజుల్లో ఐఆర్ ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 45 -55 శాతం ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ డిమాండ్‌ను ఎంతవరకు అంగీకరిస్తారనే విషయాన్ని సూత్రప్రాయంగా కూడా వెల్లడించడానికి సీఎం ఇష్టపడలేదు. ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఐఆర్ ఎంత ఇవ్వాలనే అంశాన్ని నిర్ణయిస్తామని మాత్రమే జవిబిచ్చారు. చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖతో చర్చించి ఐఆర్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా జరగడంపై ఆక్షేపణ తెలిపారు. ఈనెలాఖరులోగా ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం ఇదే తీరు కొనసాగిస్తే జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. సీఎంతో జరిగిన చర్చల్లో ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక శాఖ అధికారులు, ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర జూనియుర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు వుధుసూదన్‌రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీజీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పద్మాచారి, సచివాలయ టీ-ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 25 శాతానికి తక్కువ కాకుండా: 25 శాతానికి తక్కువ కాకుండా ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందనీ, 25-30 శాతం వుధ్యలో ఐఆర్ ప్రకటన ఉంటుందని సంఘాలు తాజాగా ఆశలు పెంచుకుంటున్నారుు. 9వ పీఆర్సీ సమయంలో అప్పటి సీఎం వైఎస్సార్ 22 శాతం ఐఆర్ ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా ఐఆర్ ఉంటుందని, ఈ దిశగానే ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు 45-55 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ 30 శాతానికి తగ్గితే అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. అవసరమైతే ఆందోళనకూ వెనకాడమంటున్నారు. హెల్త్‌కార్డులపై నేడు చర్చలు: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలను ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సాధా రణ పరిపాలన, వైద్య, ఆరోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ ట్రస్టు మధ్య సమన్వయం లేదని, ఫలితంగా పొంతనలేని నిబంధనలు, ఉత్తర్వులు వస్తున్నాయని విన్నవించారు. లోపాలు సవరించాలన్న వారి విజ్ఞప్తికి సీఎం స్పందించారు. సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కాగా ఉద్యోగులు, టీచర్లకు 50% తాత్కాలిక భృతి ప్రకటించాలని, హెల్త్‌కార్డులపై అనుమానాల్ని నివృత్తి చేయాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. హోంగార్డుల వేతనం పెంపునకు సీఎం హామీ సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో హోంగార్డులకు చెల్లించే రోజువారీ వేతనం రూ.200 నుంచి రూ.300కు పెంచేందుకు సీఎం కిరణ్ మరోసారి హామీ ఇచ్చారు. ప్రభుత్వోద్యోగులు, అధికారులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో హామీ ఇచ్చినట్టుగా రోజుకు రూ.100 పెంచుతామని, రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. -
ఐఆర్ కొలిక్కి వచ్చేనా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శనివారం సచివాలయంలో మంత్రుల బృందం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ఈ భేటీలో ఐఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే మంత్రుల బృందంతో జరిగే చర్చల్లో అవగాహన కుదరకపోతే ఐఆర్ ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఐఆర్‌పై ఇప్పటికే ఒకసారి (ఈ నెల 7న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా సమావేశం అయ్యారు. గరిష్టంగా 50% ఐఆర్‌కు డిమాండ్ పీఆర్సీ నివేదిక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 45 శాతం నుంచి 50 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్‌తో చర్చల సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్లు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం ఇవ్వాలని కోరాయి. టీఎన్జీవోల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు 45 శాతం, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 47 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారుు. కాగా, ఐఆర్‌పై పీఆర్సీ చైర్మన్ నుంచి ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి చైర్మన్ అభిప్రాయాన్ని కూడా తీసుకోగా, 15 శాతం ఐఆర్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కూడా ఐఆర్‌పై లెక్కలు వేసింది. ఐదేళ్ల కిందట 22 శాతం ఐఆర్ ఇచ్చినపుడు ఒక్క శాతానికి రూ.124 కోట్లు వెచ్చించాల్సి రాగా ఇప్పుడు ఒక్క శాతం ఐఆర్‌కు రూ.284.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 25 శాతం నుంచి 35 శాతం మధ్యలో అవగాహన కుదరవచ్చని భావిస్తున్నా.. 25 శాతానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు నగదు ప్రయోజనం 2013 జూలై 1 నుంచే వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టే అవకాశం ఉంది.