
సాక్షి, అమరావతి: సమ్మె వరకూ వెళ్లకుండా సమస్యను పరిష్కరించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు జరిపామన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత
‘‘ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వారికి న్యాయం చేశాం. ఉన్నంతలో ఉద్యోగులకు మంచి చేశాం. కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం. పీఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలూ భాగమే. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఉపాధ్యాయ సంఘాలు సరేనన్నారు. తర్వాత బయటకెళ్లి సంతృప్తిగా లేదనడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.