
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో ఉద్యోగులంతా సమానమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకోవాలనే ధోరణిని కనబరిచాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దని సీఎం స్పష్టంగా చెప్పారు.
పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని తెలిపారు. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకునే ఉద్దేశం మాకు లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
చదవండి: (‘చంద్రబాబు కోరిక తప్పక తీరుతుంది.. దేవుడు తథాస్తు అంటాడు’)