రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి అసెంబ్లీలో ఉద్యోగులను ప్రభుత్వం శుక్రవారం విభజించింది. అసెంబ్లీలోని ఐదుగురు డిప్యూటీ సెక్రటరీలలో ముగ్గురుని ఆంధ్రప్రదేశ్కు, ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. అలాగే అసెంబ్లీలోని 15 మంది అసిస్టెంట్ సెక్రటరీలలో ఐదుగురిని ఆంధ్రకు, 10 మంది తెలంగాణకు విభజించారు. అయితే అసెంబ్లీలో ఉన్నతాధికారుల విభజనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.