
ఆదిలాబాద్ లో కార్మిక సంఘాల ఆందోళన
ఆదిలాబాద్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం నుంచి అదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ధర్నాలో సీపీఎం, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.