హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరగా, 28 శాతం ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమన్యం సుముఖత వ్యక్తం చేసింది. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేవరకు సమ్మెపై వెనక్కితగ్గేదిలేదిన కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. జూలై వరకు సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ యాజమన్యం కోరింది. చర్చల అనంతరం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు వెళ్లారు. రవాణ మంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాల నాయకులు ఈ రోజు మరోసారి చర్చలు జరపనున్నారు.