
డైరీలను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో పలు విభాగాలకు చెందిన డైరీలను (2017) ఆవిష్కరించారు.
తెలంగాణ తహసీల్దార్ సంఘం, తెలంగాణ రెవెన్యూ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘంకు చెందిన డైరీలను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త జిల్లాల నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు చేరువగా ఉండి వారి సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలతోపాటు తహసీల్దార్ సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కోశాధికారి చంద్రకళ, గోపీరామ్ తదితరులు పాల్గొన్నారు.