
తూర్పు గోదావరి: నారా లోకేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ముఖ్యమంత్రి పట్ల నోటికి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయట తిరగలేవని హెచ్చరించారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకుంటున్నారని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీయో ఆరోపించారని అన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తారుమారు చేశారని పేర్కొన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ముందుగా కాపర్ డ్యామ్‌ను నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భజనలకు.. బస్సులకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయాలు నిర్వాసితులకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు.
చదవండి: కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు
పోలవరం నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి సీఎం జగన్ అని ఆయన అన్నారు. పోలవరం నిర్వాసితుల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్‌లో తీర్మాణం చేసినట్లు తెలిపారు. 2024లో అధికారంలో వస్తామని తండ్రీ కొడుకులు కలలు కంటున్నారన్నారు. ముందు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.
చదవండి: అరకు అందాలకు రాచబాట
Comments
Please login to add a commentAdd a comment