సాక్షి, తూర్పు గోదావరి: ఉచిత ఇసుక పాలసీ అమలు అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతోపాటు, పినిపే విశ్వరూప్, కలెక్టర్ మొరళీధర్‌రెడ్డిలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, దీనిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలు శాఖల అధికారులపై పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment