Sand Distribution
-
పదేపదే పచ్చ విషం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు సులభంగా, అత్యంత పారదర్శకంగా ఇసుక సరఫరా అవుతుండడం ఈనాడుకు కంటగింపుగా మారింది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు కథనం ద్వారా విషంకక్కి ప్రజల్లో అపోహలు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిపోతోందంటూ తాజాగా నిస్సిగ్గుగా కథనాన్ని వండివార్చిన రామోజీకి చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ మాత్రం కనిపించలేదు. అప్పట్లో ఐదేళ్ల బాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అడ్డూఅదుపులేకుండా ఇసుకను దోచుకుంటే ఎల్లో మీడియాకు అది ‘పారదర్శకంగా’ అనిపించింది. సాక్షాత్తూ అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా ఆయనా పట్టించుకోలేదు.. సరికదా, ఎల్లో మీడియా కళ్లుండి కబోదిలా నటించింది. చివరికి ఆ వ్యవహారంపై ఎన్జీటీ మండిపడి చంద్రబాబు ప్రభుత్వంపై రూ.100 కోట్ల జరిమానా విధించింది. కానీ, ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంటే మాత్రం ఈనాడు అక్రమం అంటూ గుండెలు బాదుకుంటోంది. క్యూఆర్ కోడ్ రశీదులు ఇస్తుంటే కనపడదా? నిజానికి.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన ఇసుక విధానంలో అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక విక్రయాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన రశీదులు చేస్తోంది. దాన్ని స్కాన్‌చేస్తే కొనుగోలు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంత పకడ్బందీగా ఇసుక విక్రయాలు నిర్వహిస్తుంటే పనిగట్టుకుని అక్రమ రాతలు రాయడాన్ని చూస్తుంటే ప్రభుత్వంపై బురద జల్లడానికి తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. అంతేకాక.. ► ఇసుక అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల దగ్గర సర్కారు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఇబి)ని నెలకొల్పి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపింది. గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్ అధికారులు కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునేలా అధికారాలు కల్పించింది. ► ఈ కేసుల్లో రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ► ఎస్ఈబి టోల్‌ఫ్రీ నెంబర్ 14500తోపాటు జిల్లాల్లోనూ ఇసుక ఆపరేషన్స్‌పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. గనుల శాఖకు ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ► ఇవి ఎప్పటికప్పుడు అన్ని ఖనిజాలు, వాటి రవాణా, చెక్‌పోస్టులను పర్యవేక్షిస్తున్నాయి. ఎక్కడైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి తనిఖీలు జరుపుతున్నాయి. ► ఇంత పకడ్బందీ నిఘా వ్యవస్థ ఉంటే ఏవో కొన్ని లారీల ఫొటోలు వేసి అక్రమ ఇసుకంటూ ఈనాడు ఓ కథనం వండివార్చేసింది. సరిహద్దుల్లో అక్రమ రవాణా అవాస్తవం ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులు దాటించి, వత్సవాయి మీదుగా తెలంగాణలోకి ఇసుక అక్రమ రవాణా అవాస్తవ కథనాన్ని ప్రచురించింది. సరుకు రవాణా వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ప్రచారం కూడా సత్యదూరం. అలాగే.. ► అసలు బ్రోకర్ల ద్వారా ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడాలేదు. వర్షాకాలంలో రీచ్‌లలో వరద నీరుచేరే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా 170 శాండ్ డిపోల్లో 82 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేశారు. ► ఇసుక కావాల్సిన వారు నేరుగా డిపోలకు వెళ్లి కావాల్సినంత కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ► ప్రతివారం గనుల శాఖ రీచ్‌ల వారీగా, అందుబాటులో ఉన్న ఇసుక రేట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. ► ఇలా.. ఇంత పారదర్శకంగా, కట్టుదిట్టంగా ఇసుక తవ్వకాలు, సరఫరా జరుగుతున్నా ఈనాడు కళ్లకు మాత్రం అదంతా అక్రమంగానే కనిపిస్తుండడం చూస్తుంటే పచ్చ కామెర్లున్న వ్యక్తికి అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతను గుర్తుచేస్తోంది. అప్పట్లో ఉచితం పేరుతో వేలకోట్ల దోపిడీ చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో రూ.వేల కోట్ల దోపిడీ జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడిచేయడం జగమెరిగిన సత్యం. ఇదంతా అప్పట్లో ఈనాడుకు చిన్న విషయంగానే కనిపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లోనే ఇసుకరీచ్‌లు నడిచాయి. తద్వారా రూ.వేల కోట్లు పిండుకున్నారు. ఇలా ఇన్ని అక్రమాలు జరిగినా రామోజీ అప్పట్లో తన కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉన్నా నిత్యం రంకెలు వేస్తున్నారు. -
సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్
మద్యం, ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపితేనే తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం. కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. సీఎం మీతో ఉన్నాడు.. దూకుడుగానే ఉండండి. రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే వారని, ఇప్పుడు 54.5 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందిస్తున్నా. వచ్చే సమీక్షా సమావేశం నాటికి కనీసం 60 లక్షల మందికి పనులు కల్పించాలి. కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి. కరోనా అని అనుమానం రాగానే ఎవరికి కాల్ చేయాలి.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి.. పాజిటివ్ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అనే కీలక విషయాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఇది చేస్తేనే వైరస్ అనుమానితులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ఏ ఇబ్బందీ ఉండదు. అప్పుడే మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లేకపోతే అది ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. సాక్షి, అమరావతి: గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు పక్కనే ఉన్న రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల అవుతుందని, గ్రామ సచివాలయంలో అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. అన్ని ఇసుక రీచ్‌లనూ ఓపెన్ చేయాలి ► వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి. జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం లక్షన్నర టన్నుల వరకూ ఇస్తున్నాం. ► శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి. అన్ని రకాల రీచ్‌లను తెరవాలి. కొత్త సోర్స్‌లను గుర్తించాలి. ► బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి. ఈ విధానం పారదర్శకంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. వర్షాలు వస్తున్నందున మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల స్థలాల పంపిణీ చిరస్మరణీయం ► ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్త వారితో కలిపి 30.30 లక్షల మందికిపైగా లబ్ధిదారులుండొచ్చు. వీరందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. జూన్ 12 కల్లా లబ్ధిదారుల తుది జాబితాను డిస్ప్లే చేయాలి. ► జూన్ 15 నాటికి పాత, జూన్ 30 నాటికి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. జూన్ 15 నాటికి ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై 8న అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ► సంతృప్త స్థాయిలో మనం ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో చివరి దశకు వచ్చాం. కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో వారికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరుతున్నా. ఇ–క్రాప్ బుకింగ్ కీలకం ► ఇ–క్రాప్ బుకింగ్ 100 శాతం కచ్చితత్వంతో జరగాలి. వ్యవసాయ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్ ద్వారా ఇ–క్రాప్ బుకింగ్ చేయించాలి. తప్పులు లేకుండా పారదర్శకంగా జరగాలి. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఇ– క్రాప్ బుకింగ్ అనేది పునాదిగా నిలుస్తుంది. ► కనీస గిట్టుబాటు ధర పొందడానికి ఈ విధానం చాలా కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఆదుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట రుణాలకు, ఇన్సూరెన్స్‌కు కూడా ఉపకరిస్తుంది. ► ఉద్యాన పంటలకు ప్రత్యేక అప్లికేషన్ ఉంది. ఆక్వాను కూడా ఇ–క్రాపింగ్‌లో ప్రత్యేక అప్లికేషన్లో పెడుతున్నాం. మార్కెటింగ్‌లో ఇది కీలకం కాబోతుంది. నాడు–నేడుపై జేసీ నిత్యం పర్యవేక్షించాలి ► అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్న జేసీ స్కూళ్లలో నాడు– నేడు కార్యక్రమాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఏం కావాలన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులు మాత్రం వేగంగా జరగాలి. ► 15 కొత్త మెడికల్ కాలేజీలను మనం కట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాలను హేండోవర్ చేయాల్సి ఉంది. ఒక్కో కాలేజీ కోసం కనీసం 50 ఎకరాలు గుర్తించాలి. ► వచ్చే సమీక్షా సమావేశం నాటికి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్, మెడికల్ కాలేజీలకు సంబంధించి భూముల గుర్తింపు పూర్తి కావాలి. ► గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌పై మరింతగా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉంటే అనుమతులు ఇచ్చి పనులు వేగవంతం చేయాలి. ► పట్టణ, నగరాల్లోని వైఎస్సార్ క్లినిక్స్‌కు సంబంధించి రేపటికి మ్యాపింగ్ చేయబోతున్నారు. వీటికి స్థలాలను గుర్తించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. ► అంగన్వాడీ కేంద్రాలు కూడా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాయి. 55 వేల అంగన్వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగులు కట్టాలి. మిగిలిన వాటిలో మరమ్మతులు చేయాలి. వీటిలో కూడా నాడు–నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కోవిడ్–19పై ప్రజల్లో అవగాహన పెంచాలి ► కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు చాలా బాగా పని చేశారు. వలంటీర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ వర్కర్లు.. అందరూ చాలా బాగా పని చేశారు. ► కరోనా వైరస్ విషయంలో దేశంలో పాజిటివిటీ రేటు 6 శాతం అయితే రాష్ట్రంలో 1 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు. అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కోవిడ్‌తో ఎలా కలిసి బతకాలన్న దాని గురించి మనం ఆలోచించాలి. ► 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. కేవలం 2 శాతం కేసుల్లో మాత్రమే మరణాలు ఉంటున్నాయి. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ ఫెసిలిటీస్ మీద కూడా దృష్టి పెట్టాలి. సచివాలయాల ఉద్యోగులపై జేసీ దృష్టి పెట్టాలి ► గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులపై సంబంధిత జేసీ దృష్టి పెట్టాలి. పనీతీరుపై, ప్రజలకు అందుతున్న సేవలపై రోజూ సమీక్ష నిర్వహించాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ► స్పందన కింద వచ్చే వినతులను జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలుపెడితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ► ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఇచ్చిన అతి ముఖ్యమైన నంబర్లు, సచివాలయాల్లో అందే సేవల గురించి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పకుండా డిస్ ప్లే కావాలి. అలాగే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలిపేలా ప్రకటించిన సంక్షేమ క్యాలండర్‌నూ ప్రదర్శించాలి. ► లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్ డెలివరీ చేయాలి. బయోమెట్రిక్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం ► మద్యం వినియోగం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశాం. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాం. ► మద్యం విక్రయించే వేళలనూ బాగా తగ్గించాం. పద్ధ్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం. షాక్ కొట్టే రీతిలో రేట్లు పెంచాం. ► ఇవన్నీ చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు. -
ఇసుక పాలసీ అధికారులపై ఆగ్రహించిన డిప్యూటీ సీఎం!
సాక్షి, తూర్పు గోదావరి: ఉచిత ఇసుక పాలసీ అమలు అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతోపాటు, పినిపే విశ్వరూప్, కలెక్టర్ మొరళీధర్‌రెడ్డిలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, దీనిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలు శాఖల అధికారులపై పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. -
ఇంటికే ఇసుక విజయవంతం
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా ఇంటివద్దకే ఇసుక అందించే సరికొత్త విధానం నాలుగు జిల్లాల్లో విజయవంతం కావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం 9 జిల్లాల్లో ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకుని స్టాక్ యార్డుల నుంచి పొందే సదుపాయం ఉంది. నాలుగు జిల్లాల్లో మాత్రం వినియోగదారులు కోరిన చోటకే ఇసుకను అందచేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. మాఫియా, దళారీ వ్యవస్థలను నిర్మూలించడంతోపాటు అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సరసమైన ధరలకు ఇసుకను అందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. రాష్ట్రమంతా డోర్ డెలివరీకి కసరత్తు గత ఏడాది సెప్టెంబరు 5వతేదీన కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) 60.44 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇసుకను అందించే విధానం తొలుత అమల్లోకి తెచ్చింది. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఇసుక డోర్ డెలివరీ విధానాన్ని అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో ప్రవేశపెట్టింది. కిలోమీటర్ల వారీగా టన్ను / ట్రాక్టరుకు ఇసుక రవాణా చార్జీలను అధికారులు ఖరారు చేశారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో ఇంటికే ఇసుక అందచేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 1.12 లక్షల మందికి డోర్ డెలివరీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఇసుకను ఇక్కడి అవసరాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్ పోస్టులను పెంచడంతోపాటు మూడు వేల మందికిపైగా కొత్త సిబ్బందిని నియమిస్తోంది. 24 గంటలూ పనిచేసేలా శక్తివంతమైన సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచే వాహనాల కదలికలపై నిఘా జీపీఎస్ పరికరాలు కలిగి ఉండి, భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలనే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలు ఎక్కడ నుంచి బయలుదేరాయి? ఎక్కడకు వెళుతున్నాయి? దారి మళ్లుతున్నాయా? అనే విషయాలను విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. -
‘గంజి లేని స్థితి నుంచి బెంజ్ కారు వరకు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ హయాంలో నాలుకతో కూడా ఇసుకను ఎత్తుకు పోయారని చోడవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరం మండలం నర్సాపురం వద్ద ఇసు డిపోను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక డిపోతో చోడవరంలో ఇసుక సమస్యలు తీరనున్నాయన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల కొంత ఇసుక కొరత ఏర్పడిందని, ఇప్పడు ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నాయకులు గంజి లేని స్థితి నుంచి ఇసుక అమ్మకం చేపట్టి బెంజ్ కార్లలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాగే మద్యం అమ్మకాల సమయపాలన వల్ల రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడే వ్యక్తులు వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ సీతారాం రాజు, గనులశాఖ ఏడీ తమ్మినాయుడు, ప్రత్యేక అధికారి అనిత పాల్గొన్నారు. -
‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక సరఫరా మెరుగుపరుస్తామని మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని నదుల్లో వరద ప్రవాహం ఉందని తెలిపారు. ఎన్నడూ ఊహించని విధంగా వరద, వర్షాలు ముంచెత్తాయని గుర్తు చేశారు. రీచ్‌లు, ఇసుక ఉన్నా తవ్వడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ప్రతికూల వాతావరణంలోనూ రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీస్తున్నామని తెలిపారు. వరదలు తగ్గగానే పూర్తిస్థాయిలో రీచ్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 267 రీచ్‌ల్లో 69 చోట్ల మాత్రమే ఇసుక తీయగలుగుతున్నాం. త్వరలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తాం. ఇసుక మైనింగ్‌లో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్‌లు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మరో నాలుగేళ్ల వరకు ఇబ్బందులు లేని ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇసుక రవాణా వాహనాలకు కూడా జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నాం’అని రాంగోపాల్ చెప్పారు. -
ఇసుక వారోత్సవాలకు సీఎం జగన్ నిర్ణయం
-
ఇసుక వారోత్సవాలకు సీఎం జగన్ నిర్ణయం
సాక్షి, తాడేపల్లి : స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక వారోత్సవాలను నిర్వహిద్దామని ఆయన నిర్ణయించారు. వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి.. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పళ్లు ఇచ్చే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారు. గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతి మయం అయింది. దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాం. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. కానీ, రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగవుతాయి’ అని సీఎం అన్నారు. 70 చోట్ల ఇసుక రీచ్‌లు గుర్తింపు.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి తర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దీనిని పర్యవేక్షించాలి. ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవరసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదు. గతంలో అవినీతి , మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టాభూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల మాన్యవల్‌గా ఇసుక తీయాలని చెప్పాం. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో 70 చోట్ల రీచ్‌లను గుర్తించారు’అని సీఎం చెప్పారు. 20 కి.మీ. వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ‘గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కి.మీ వరకు ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలించవచ్చు. పనులు కావాల్సిన కార్మికులు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చు. వరదలు తగ్గగానే రీచ్‌ల్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలి. ప్రభుత్వం అధినంలోనే ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి.. పేదలకు మరింత మంచే జరుగుతుంది. ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. కౌలు రైతులకు సాయం చేశాం.. వారికి మరిన్ని పనులు కల్పించే అవకాశం ఉంటుంది. వరదల కారణంగా 267 రీచ్‌లకు 69 చోట్ల మాత్రమే ఇసుక తీస్తున్నారు. నవంబర్ వరకు వరదలు తగ్గుతాయి. ఇసుక అందుబాటులోకి వస్తుంది’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. -
రాష్ట్రంలో రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా
-
‘ఇసుక సరఫరాపై బాధ్యత జాయింట్ కలెక్టర్లదే’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై శనివారం సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని, దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారని, తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి.. ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని మంత్రి పెద్డిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. రీచ్ లకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్లను గుర్తించాలని, ఓపెన్ రీచ్‌లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నామని అన్నారు. గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోందని, జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలలను గుర్తించాలని, వీటిని బయటకు తీయడం వల్ల జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుండటంతోపాటు ఇసుక సరఫరా మెరుగవుతుందని మంత్రి తెలిపారు. మెదటి, రెండు, మూడు గ్రేడ్ లలోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతి ఇస్తామని, గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్‌లవద్ద పెట్టి ఆన్లైన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. మైనింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలని, ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంత వరకు ఇసుకను రిజర్వు చేయాలని, ఇసుక అవసరాల కోసం ఆన్లైన్ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. -
ఇసుక రవాణాకు గ్రీన్‌సిగ్నల్
జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా అధికారులు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక కావాలంటూ దరఖాస్తు చేసుకుంటే చాలు.. వెంటనే రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిర్మాణాలను పరిశీలించి అనుమతులు చేతికిచ్చేస్తున్నారు. దీంతో ఇసుక రవాణాదారులు రీచ్‌ల వద్ద బారులు తీరుతున్నారు. రీచ్‌లలో ఉచితంగానే ఇసుక దొరకతుండడంతో భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలో పర్యావరణ అనుమతులు ఉన్న 14 ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. జిల్లాలోని నెల్లూరురూరల్ మండలం సజ్జాపురం రీచ్ 1,2లో 5,375 హెక్టార్లకు గాను 46,168 క్యూబిక్ మీటర్లు ఇసుక తవ్వకాలకు, పొట్టేపాళెంలోని నాలుగు రీచ్‌లలో 18,367 హెక్టార్లకు గాను 1,83,670 క్యూబిక్ మీటర్ల ఇసుక, గొల్ల కందుకూరులో రీచ్‌లో 3,840 హెక్టార్లకుగాను 38,042 క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మినగల్లు రీచ్‌లో 2,792 హెక్టార్లలో 27,924 క్యూబిక్ మీటర్లు ఇసుక, ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం 1,2 రీచ్‌లలో 27,049 హెక్టార్లకుగాను 1,72,,496 క్యూబిక్ మీటర్లు ఇసుక రవాణా, అనంతసాగరం మండలంలోని లింగంగుంటలో 1,570 హెక్టార్లలో 15,700 క్యూబిక్ మీటర్లు ఇసుక, అదే మండలంలోని పడమటి కంభంపాడులో 4,451 హెక్టార్లలో 44,517 క్యూబిక్ మీటర్లు, విడవలూరు మండలంలోని ముదివర్తిలో 2,509186 దరఖాస్తులకు అనుమతులు జిల్లాలోని భవన నిర్మాణాలకు సంబంధించి 186 దరఖాస్తులకు ఇసుక రవాణాకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. మరో 70 వరకు దరఖాస్తులు రాగా పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్నాయి. స్థానికంగా పేదలకు అవసరమయ్యే ఇసుక తోలకాలకు సంబంధించి ఎడ్లబండ్లకు స్థానికంగానే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారన్నారు. ఇప్పటికే దాదాపు 500 వాహనాలకు ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. అపార్ట్మెంట్లు, మేనకూరు సెజ్, షార్ కేంద్రం, శ్రీసిటీలో జరిగే భారీ నిర్మాణాలకు మాత్రం రెవెన్యూ, మైనింగ్ అధికారుల పరిశీలన చేసి ఆపై జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి ఇస్తున్నారు. కలెక్టర్ సైతం ఇసుక దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అనుమతులు చకచకా ఇస్తుండడంతో ఇసుక కొరత లేకుండా సరఫరా జరుగుతోంది. హెక్టార్లలో 25,091 క్యూబిక్ మీటర్లు ఇసుక, పొదలకూరు మండలంలోని విరువూరులో 4,694 హెక్టార్లలో 46,945 క్యూబిక్ మీటర్లు ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వడంతో ఇసుక రవాణా వేగవంతంగా జరుగుతోంది.ఉచితంగా ఇసుక సరఫరా జిల్లాలో 14 రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులిచ్చాం. ఇసుక రవాణా అనుమతులను పారదర్శకంగా ఇచ్చాం. ఎక్కడా కూడా అనుమతులకు నగదు వసూళ్లు చేసినట్లు ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అనుమతులు చకచకా ఇచ్చేయడంతో ఇసుక కొరత లేకుండా రవాణా సాగుతోంది. అపార్ట్మెంట్ల నిర్మాణాలకు మాత్రం తప్పక పరిశీలన చేసి అనుమతులు ఇస్తున్నాం. త్వరలో నూతన పాలసీ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఆరు రీచ్‌లకు ఇసుక రవాణాకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. – వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ -
ఇసకేస్తే రూ.కోట్లు!
► జీవీఎంసీలో ఇసుకాసురుల దందా ► ఉచిత ఇసుకకూ అనుచిత వసూళ్లు ► శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి ఇసుక రవాణా ► దానికి అనుమతి పేరుతో దోచేస్తున్న అధికారులు ► ట్రిప్పునకు రూ.500 ఇస్తేనే స్లిప్పు ► ప్రతిరోజూ వందలాది ట్రిప్పులు మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో పనిచేసిన పాము పాండురంగారావు రూ. వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటే మొదట్లో ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.. కూసింత బయటపడితే.. చింపి చేటంత చేస్తారన్న వ్యాఖ్యలు వినిపించాయి.. కానీ పక్కా ఆధారాలతో వెల్లడైన ఆస్తుల లెక్కలు.. అందరి కళ్లూ అంటుకుపోయేలా చేశాయి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జీవీఎంసీలో అలాంటి అవినీతి ‘కట్టల’ పాములు ఇంకా చాలానే ఉన్నాయి మరి.. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కొని కోట్లు కూడబెట్టేవారు ఇంకెంతో మంది ఉన్నారు.. అంతెందుకు.. ప్రభుత్వం ఇసుక సరఫరాను ఉచితం చేసినా.. అందులోనూ రూ. కోట్ల కుప్పలు పోగేసుకోగల ఘనులు.. మన జీవీఎంసీ అధికారులు! రవాణాకు అనుమతుల పేరుతో.. ట్రిప్పునకు ఇంత అని రేటు పెట్టి మరీ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అదెలాగంటే... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గతంలో ఇసుక రీచ్‌ల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం.. ఇసుక కొరత నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్కడో ఏమో గానీ.. జీవీఎంసీ అధికారులకు మాత్రం ఈ విధానం ‘ఉచిత’ సంపాదన మార్గంగా మారింది. అడ్డదారిలో రూ.కోట్లు సంపాదించిపెడుతోంది. జీవీఎంసీ పరిధిలో భారీ స్థా?ఇలో భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇసుక కొరత తీవ్రమైంది. జిల్లాలో ఏ రీచ్‌లోనూ ఇసుక లభ్యం కాని పరిస్థితుల్లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్కడి రీచ్‌ల నుంచి ఇసుక తెప్పిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని నిర్మాణాలకు అవసరమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం ముద్దాడ, పింగూరు రీచ్‌ల నుంచి తీసుకునేందుకు అనుమతులు పొందారు. అక్కడ కూడా పూర్తి ఉచితంగానే ఇసుక పంపిణీ చేస్తారు. అయితే రవాణా ఖర్చులు మాత్రం వినియోగరారుడే భరించాలి. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమకు అవసరమైన ఇసుక కోసం కార్పొరేషన్ అధికారుల నుంచి సిఫారసు చేయించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకొని జీవీఎంసీ అధికారులు దోపిడీ పర్వానికి తెర తీశారు ఇసుక కావాల్సిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించాలి. తమ నిర్మాణాలకు సంబంధించి ఎన్ని ట్రిప్పుల ఇసుక కావాలో ముందుగా తెలియజేయాలి. ఆ మేరకు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి సదరు కాంట్రాక్టర్లకు స్లిప్‌లు అందిస్తారు. ఆ స్లిప్ తీసుకుని పొందూరు మండలంలోని రీచ్‌కు వెళ్తే అక్కడ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు. కానీ కార్పొరేషన్ అధికారులు ట్రిప్పునకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని రూ.500 వాళ్లకు ముట్టజెప్పాల్సిందే. అసలే తీవ్రమైన ఇసుక కొరతతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయిన తరుణంలో కాంట్రాక్టర్లు మారు మాట్లాడకుండా ట్రిప్పుకు 500 చొప్పున ఇచ్చి స్లిప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా రోజుకు 300 నుంచి 400 ట్రిప్పులు పొందూరు మండలం నుంచి వస్తున్నాయి. దీన్ని బట్టి జీవీఎంసీ అధికారులు ఉచిత ఇసుక పంపిణీ ద్వారా ఎంత కొల్లగొడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏం చేస్తున్నట్టు? ఉచిత ఇసుక వ్యవహారంలోనూ జీవీఎంసీ అధికారులు కాసులు వెతుక్కుంటుంటే కాంట్రాక్టర్స్ అసోసియేన్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా స్లిప్‌లు అందించే పని చేపట్టారు. అయితే అసోసియేషన్‌లోని కొందరు.. అవినీతి అధికారులతో కుమ్మక్కై.. స్లిప్ రాస్తే తమకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్లకు కొంత.. వీళ్లకు కొంత అంటూ అటు అసోసియేషన్.. ఇటు అధికారులు వాటాలు వేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నా విధి లేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరికివ్వాల్సింది వారికి ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.