సాక్షి, తూర్పుగోదావరి : శాసన మండలి రద్దు అంశంపై సోమవారం పునః సమీక్ష చేసి తమ నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని చంద్రబోస్ వెల్లడించారు.
పేదలకు ఇచ్చే ప్రతి ఇంటి స్థలం మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21.34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 26,136 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని చెప్పారు. మరో 12,219 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. అసైన్డ్ భూములు, దేవస్థానం, వక్ఫ్ బోర్డ్ భూములు సేకరించకూడదని చంద్రబోస్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment