
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్రం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు. ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఎగనామ పెట్టడం ఏపీ ప్రజలకు బాధాకరం. కరోనా కారణంగా మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహ ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఏ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారో.. ఆ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని’’ సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల)
ఆయన స్వార్థం కోసమే పనిచేశారు..
విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు స్వార్థం కోసం పనిచేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతుందన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తున్న పథకాలపై దృష్టి పెట్టాయి. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను నేటి తరాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమి చేస్తుందో రైతులకు బాగా తెలుసు. టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. రైతులకు ఇవ్వాల్సిన నిధులు చంద్రబాబు ఎగ్గొట్టితే ఆ బాకీలు వైఎస్ జగన్ చెల్లించారు.
ఐదేళ్లలో టీడీపీ రైతుల కోసం కేటాయించిన నిధులు 13000 కోట్లు.. ఏడాదికి రైతు భరోసా కింద సీఎం జగన్ కేటాయించిన నిధులు 13000 కోట్లు. పరిపాలనలో టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అమరావతి, పోలవరంలలో కూడా చంద్రబాబు అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు వైఎస్సార్‌సీపీ పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని’’ సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (చదవండి: ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని)
Comments
Please login to add a commentAdd a comment