![Over Visakha Steel Plant YSRCP MPs Meet Amit Shah - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/12/pilli-subhash.jpg.webp?itok=7x_93flz)
సాక్షి,న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించారు. అలానే రాష్ట్రంలో జరిగిన ఆలయాల ధ్వంసం వెనుక టీడీపీ పాత్ర ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాం. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపేందుకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాం. ప్రధాని మోదీతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని అమిత్ షా హామీచ్చారు’’ అన్నారు.
దేవాలయాల ధ్వంసం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విన్నవించాం అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ‘‘అంతర్వేది రథం దగ్ధం, విగ్రహాల విధ్వంసంలో టీడీపీ పాత్ర ఉంది. ఆలయాల ధ్వంసం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని కోరాం’’ అని తెలిపారు.
చదవండి: ‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం..
Comments
Please login to add a commentAdd a comment