
ప్రజాసమస్యలు తీర్చడానికి 11 రకాల ఉద్యోగులు ఒకే ప్రదేశంలో పనిచేయడానికి ఒక కార్యాలయం ఉండటం అనేది దేశ చరిత్రలోనే ప్రథమం.
సాక్షి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టనుంది. ప్రతి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుందని వెల్లడించారు. ‘ప్రజాసమస్యలు తీర్చడానికి 11 రకాల ఉద్యోగులు ఒకే ప్రదేశంలో పనిచేయడానికి ఒక కార్యాలయం ఉండటం అనేది దేశ చరిత్రలోనే ప్రథమం. గ్రామ వాలంటీర్లు ప్రజాసేవకు అంకితం అవడం ఆహ్వానించదగింది. ఇలాంటి గొప్ప వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు’అని డిప్యూటీ సీఎం అన్నారు.
మరో కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. దేశంలోనే విప్లవాత్మకమైన వ్యవస్థకు నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే. అలాంటి మంచి అవకాశం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కింది. సీఎం వైఎస్ జగన్ మానసపుత్రిక వంటి ఆలోచనే ఈ గ్రామ సచివాలయాలు. నిజమైన గ్రామ స్వరాజ్యానికి అద్దం పట్టే ఈ వ్యవస్ధకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప గ్రామం నుంచి సీఎం జగన్ స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో పరిపాలనా తీరు తెన్నులు మారిపోబోతున్నాయి’ అని చెప్పారు.