అధికార వికేంద్రీకరణతో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ శనివారం అన్నారు. జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్ నేతన్న నేస్తం ఆవిష్కరణ మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాలల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రెండో రాజధానిని హైదరాబాదులో పెట్టాలని ఆనాడు డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పారని తెలిపారు.