
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు పోరాటం చేసి స్టీల్‌ప్లాంట్ సాధించుకున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను మూడు దశల్లో పునరుద్ధరించాలని ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
‘‘బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలి. రుణాలను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్‌లను కేటాయించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని’’ ఎంపీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి ప్రస్తావన లేదని, విశాఖ మెట్రోకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకి కిసాన్ రైళ్లను ఎక్కువగా నడపాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.సంకుచిత బుద్ధితో టీడీపీ నేతలు ఆలయాలను కూల్చారని, ఆలయాల్లో విధ్వంసంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రవీణ్ చక్రవర్తి మతమార్పిడిలకు పాల్పడ్డారని.. తమ పాలనలో ఆలయాలపై దాడులు చాలా తగ్గాయని’’ ఎంపీ పేర్కొన్నారు.
(చదవండి: బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో..)
కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!
Comments
Please login to add a commentAdd a comment