
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు.
కాగా సత్యనారాయణమ్మ అకాల మరణంతో సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాణమ్మ బౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రామచంద్రాపురం మండలం స్వగ్రామమైన హసనాబాధకు తరలించారు.ఆమె అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి. సత్యనారాయణమ్మ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున హసనాబాద్‌కు చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment