hasanbada
-
ఎంపీ పిల్లి సుభాష్ ఇంట తీవ్ర విషాదం
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. కాగా సత్యనారాయణమ్మ అకాల మరణంతో సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాణమ్మ బౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రామచంద్రాపురం మండలం స్వగ్రామమైన హసనాబాధకు తరలించారు.ఆమె అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి. సత్యనారాయణమ్మ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున హసనాబాద్‌కు చేరుకుంటున్నారు. -
ఎమ్మెల్సీ బోస్‌ను కలిసిన ముద్రగడ
హస¯ŒSబాద(రామచంద్రపురం రూరల్) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం హస¯ŒSబాదలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఆయన స్వగృహంలో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ముద్రగడ మాట్లాడుతూ తనకు మంచి స్నేహితుడైన ఎమ్మెల్సీ బోస్‌ను స్నేహపూర్వకంగానే కలిశానన్నారు. ఆయన వెంట కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, తొగరు మూర్తి, అనిశెట్టి సత్యం కాపు, నల్లా దుర్గారావు, సూరిబాబు తదితరులున్నారు. -
జ్యోత్స్నకు కొనసాగుతున్న సాయం
సాక్షి కథనానికి స్పందన హస¯ŒSబాద(రామచంద్రపురం రూరల్) : అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల జ్యోత్స్నకు దాతలు విరాళాలు సమర్పిస్తున్నారు. రామచంద్రపురం మండలం హస¯ŒSబాదకు చెందిన ఏడేళ్ల బాలిక వాసంశెట్టి జ్యోత్సS్న సమస్యను సాక్షిలో సెప్టెంబరు 28న ప్రచురితమైంది. ఈ కథనం విస్తృతంగా ప్రచారం కావడంతో జ్యోత్స్నకు మానవతావాదుల విరాళాలు కొనసాగు తూనే ఉన్నాయి. కథనం ప్రచురితమైన వెంటనే విజయనగరం నుంచి ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధులు వచ్చి వీల్‌చైర్‌తో పాటు నగదు అందజేశారు. అలాగే చిన్నారి బ్యాంకు ఖాతాలో దాతలు సొమ్మును జమ చేస్తున్నారు. బ్యాంకులో ఇప్పటికి రూ. 48 వేలు జమ కాగా, కొంత మంది స్వయంగా వచ్చి సాయం అందజేస్తున్నారు. బిక్కవోలు కు చెందిన వంగా సూర్యప్రకాశరెడ్డి అలియాస్ ఎడ్ల పందాలు సూరిబాబు రెడ్డి, తనకు సన్నిహితులైన బిక్కవోలుకు చెందిన నందిపాటి వీరవెంకట సుబ్బారెడ్డి రూ. 1000, పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు దాతలు రూ. 2 వేలు, గొల్లలమామిడాడకు చెందిన సబ్బెళ్ల రామలక్ష్మణులు రూ. 4 వేలు, సత్తి శ్రీనివాసరెడ్డి రూ. 2000, నల్లమిల్లి ఈశ్వరరెడ్డి రూ. 5 వేలు, బలభద్రపురానికి చెందిన కొవ్యూరి సతీష్‌రెడ్డి రూ. 2500, నల్లమిల్లికి చెందిన పాస్టర్ శామ్యూల్ రాజు రూ. 1000, సంపరకు చెందిన మడిచర్ల కొండబాబు రూ. 1000, సొమ్ములకు తను స్వయంగా రూ. 1000 చేర్చి మొత్తం రూ. 19,500లు హస¯ŒSబాదలో శనివారం హస¯ŒSబాదలో జ్యోత్స్న ఇంటికి వచ్చి అందజేసారు. వీరు కాక బొమ్మూరుకు చెందిన స్వరాజ్య లక్ష్మి రూ. 5 వేలు, రాయవరానికి చెందిన మల్లిడి హరనాథరెడ్డి రూ.10 వేలు, రావులపాలెం చిన్నారెడ్డి రూ. 1000 చిన్నారికి ఇచ్చినట్లు పాప తల్లిదండ్రులు వరలక్ష్మి, వెంకటరమణలు తెలియజేసారు. శక్రవారం రామచంద్రపురం పట్టణానికి చెందిన డోనర్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు సంయుక్తంగా రూ.25 వేలు జ్యోత్స్నకు అందించిన విషయం పాఠకులకు విదితమే. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కలవగా ఎన్ని లక్షలు ఖర్చయినా వైద్యం చేయించేందుకు తాను సహకరిస్తానని మాటివ్వడంతో పాటు రూ.10 వేలు సహాయం అందజేసారని తండ్రి వెంకటరమణ తెలిపారు. సహకరిస్తున్న దాతలకు, తమ సమస్యను వెలుగులోనికి తెచ్చిన సాక్షికి ఎంతైనా రుణపడి ఉంటామని జ్యోత్స S్న తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
పాపం ఇక్కట్లే
అరుదైన వ్యాధితో హసన్‌బాద బాలిక ∙ ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రుల సతమతం దాతల సహకారం కోసం ఎదురుచూపు ముద్దులొలికే చిన్నారులు కనిపిస్తే ‘‘ఎంత ముద్దొస్తుందో! ఆ పాప.. ముట్టుకుంటే కందిపోద్దేమో! అని అనడం ఎవరికైనా సహజమే. అయితే ఈ బోసినవ్వుల చిన్నారిని ‘‘ముద్దొస్తుంది కదా.. అని ముట్టుకుంటే మాత్రం.. ప్రమాదమే. ఎందుకంటే అంతుచిక్కని అరుదైన ఎముకల వ్యాధి ఆ బాలికను ఇలా కట్టిపడేసింది. కాళ్లకు, చేతులకు సిమెంట్ కట్టులతో నిత్యం నరకయాతన అనుభవించేలా చేసింది. తన అవయవాలు ఎందుకు పనిచేయడం లేదో తెలియని ఆ చిన్నారి.. తన అమాయకత్వపు మాటలతో అందరి కంట కన్నీరు రప్పిస్తోంది. – హసన్‌బాద (రామచంద్రపురం రూరల్) వాసంశెట్టి జ్యోత్స్న. వయస్సు ఏడేళ్లు. రామచంద్రపురం మండలం హసన్బాదకు చెందిన వెంకటరమణ, వరలక్ష్మిల చిన్న కుమార్తె. నెలల వయస్సులో ఈ చిన్నారి బాగా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తుందో తెలియని తల్లిదండ్రులు ఆ చిన్నారిని వైద్యులకు చూపించగా వారు ఏవో మందులు ఇచ్చి పంపించేసేవారు. అయితే మూడో నెలలో ఆ చిన్నారి కాలి ఎముకల్లో పగుళ్లను వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆ చిన్నారి కాళ్లు, చేతులు, కాలర్‌బోన్, మోకాళ్లు ఇలా అన్ని చోట్ల ఎముకలు విరిగిపోతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 60 సార్లు వరకు కట్లు వేయించారు. ఏడు సార్లు ఆపరేషన్లు చేసి రాడ్లు వేశారు. అరుదైన వ్యాధి... టైప్–1 కొల్లాజెన్ డెఫిసియెన్సీ కారణంగా వచ్చే ఆస్టియో జెనిసిస్ ఇంఫెర్ఫికా వ్యాధిగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యాధి లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి కారణంగా పుట్టుక నుంచే ఎముకలు మెత్తగా ఉండిపోతాయని, చిన్న ఒత్తిడి తగిలితేనే విరిగిపోతాయని చెబుతున్నారు. వ్యాధి ఇది అని తెలిసినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు పాపను గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్నానం చేయిస్తుండగా ఒకసారి చేయి విరిగిపోయింది. దీంతో పాపను ముట్టుకుంటే ఏమి జరుగుతుందోనని భయపడుతూ ఆ పాపను వారు కనీసం తాకలేకపోతున్నారు. అంత బాధలోనూ.. ఆత్మవిశ్వాçÜంతో.. అరుదైన బాధతో జోత్స్న బాధపడుతున్నా.. ఆమెలో చదువుకోవాలనే ఆసక్తి కనబరుస్తోంది. హసన్‌బాదలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారిని ఎవరైనా ‘‘నీవు చదువుకుని ఏం చేస్తావు? అని అడిగితే ‘బ్యాంక్ మేనేజరవుతానని తడుముకోకుండా చెప్పడమే కాకుండా నాన్నతో పాటు అందరికీ డబ్బులు ఇస్తానంటూ ఆత్మవిశ్వాçÜంతో జీవిస్తోంది. చిన్నారి జ్యోత్స్నకు ఆర్థికంగా సహకరించాలనుకునేవారు తండ్రి వెంకట రమణ సెల్ : 9948352658 నంబరును సంప్రదించవచ్చు. అలాగే జ్యోత్స్న బ్యాంకు ఖాతా నం. 34751900991, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద్రాక్షారామ, ఐఊSఇ ఇౌఛ్ఛీ. SఆఐN 0002711 సొమ్ము జమ చేయవచ్చు. అప్పు చేసే స్థోమత లేదు వ్యవసాయ కూలీగా ఉన్న నేను రోజు కూలీతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఏడు సార్లు జ్యోత్స్నకు ఆపరేషన్లు చేయించాం. ఒకసారి మాత్రమే ఆరోగ్యశ్రీలో(ఎన్టీఆర్ వైద్య సేవ) చేశారు. ఇప్పటికే రూ.4.50 లక్షలు అప్పు చేశాను. ఇక అప్పు చేసే స్థోమత లేదు. అమ్మాయి పెద్దయ్యే వరకు దినదిన గండంగా ఎదుర్కోవాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయమేస్తోంది. – వాసంశెట్టి వెంకటరమణ, జ్యోత్స్న తండ్రి మూడు చక్రాల సైకిల్ అందివ్వండి తన ఒంట్లో ఇంత బాధను తట్టుకుంటుంది కానీ, చదువుకు దూరమైతే మాత్రం తట్టుకోలేకపోతోంది. బాగా చదువుతుంది కదా ప్రైవేటు పాఠశాలలో బావుంటుందేమోనని దగ్గరలోని పాఠశాలలో చేర్చాం. కానీ వారు మీ అమ్మాయిని చూడలేమని ఇంటికి తీసుకొచ్చి దింపేశారు. ఆరోజంతా వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది. ఎవరైనా దాతలు మూడు చక్రాల సైకిల్ ఏర్పాటు చేస్తే పాఠశాలకు తనను తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుంది. – వరలక్ష్మి, జ్యోత్సS్న తల్లి