పాపం ఇక్కట్లే
-
అరుదైన వ్యాధితో హసన్‌బాద బాలిక ∙
-
ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రుల సతమతం
-
దాతల సహకారం కోసం ఎదురుచూపు
ముద్దులొలికే చిన్నారులు కనిపిస్తే ‘‘ఎంత ముద్దొస్తుందో! ఆ పాప.. ముట్టుకుంటే కందిపోద్దేమో! అని అనడం ఎవరికైనా సహజమే. అయితే ఈ బోసినవ్వుల చిన్నారిని ‘‘ముద్దొస్తుంది కదా.. అని ముట్టుకుంటే మాత్రం.. ప్రమాదమే. ఎందుకంటే అంతుచిక్కని అరుదైన ఎముకల వ్యాధి ఆ బాలికను ఇలా కట్టిపడేసింది. కాళ్లకు, చేతులకు సిమెంట్ కట్టులతో నిత్యం నరకయాతన అనుభవించేలా చేసింది. తన అవయవాలు ఎందుకు పనిచేయడం లేదో తెలియని ఆ చిన్నారి..
తన అమాయకత్వపు మాటలతో అందరి కంట కన్నీరు రప్పిస్తోంది.
– హసన్‌బాద (రామచంద్రపురం రూరల్)
వాసంశెట్టి జ్యోత్స్న. వయస్సు ఏడేళ్లు. రామచంద్రపురం మండలం హసన్‌బాదకు చెందిన వెంకటరమణ, వరలక్ష్మిల చిన్న కుమార్తె. నెలల వయస్సులో ఈ చిన్నారి బాగా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తుందో తెలియని తల్లిదండ్రులు ఆ చిన్నారిని వైద్యులకు చూపించగా వారు ఏవో మందులు ఇచ్చి పంపించేసేవారు. అయితే మూడో నెలలో ఆ చిన్నారి కాలి ఎముకల్లో పగుళ్లను వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆ చిన్నారి కాళ్లు, చేతులు, కాలర్‌బోన్, మోకాళ్లు ఇలా అన్ని చోట్ల ఎముకలు విరిగిపోతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 60 సార్లు వరకు కట్లు వేయించారు. ఏడు సార్లు ఆపరేషన్లు చేసి రాడ్లు వేశారు.
అరుదైన వ్యాధి...
టైప్–1 కొల్లాజెన్ డెఫిసియెన్సీ కారణంగా వచ్చే ఆస్టియో జెనిసిస్ ఇంఫెర్‌ఫికా వ్యాధిగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యాధి లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి కారణంగా పుట్టుక నుంచే ఎముకలు మెత్తగా ఉండిపోతాయని, చిన్న ఒత్తిడి తగిలితేనే విరిగిపోతాయని చెబుతున్నారు. వ్యాధి ఇది అని తెలిసినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు పాపను గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్నానం చేయిస్తుండగా ఒకసారి చేయి విరిగిపోయింది. దీంతో పాపను ముట్టుకుంటే ఏమి జరుగుతుందోనని భయపడుతూ ఆ పాపను వారు కనీసం తాకలేకపోతున్నారు.
అంత బాధలోనూ.. ఆత్మవిశ్వాçÜంతో..
అరుదైన బాధతో జోత్స్న బాధపడుతున్నా.. ఆమెలో చదువుకోవాలనే ఆసక్తి కనబరుస్తోంది. హసన్‌బాదలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారిని ఎవరైనా ‘‘నీవు చదువుకుని ఏం చేస్తావు? అని అడిగితే ‘బ్యాంక్ మేనేజరవుతానని తడుముకోకుండా చెప్పడమే కాకుండా నాన్నతో పాటు అందరికీ డబ్బులు ఇస్తానంటూ ఆత్మవిశ్వాçÜంతో జీవిస్తోంది.
చిన్నారి జ్యోత్స్నకు ఆర్థికంగా సహకరించాలనుకునేవారు తండ్రి వెంకట రమణ సెల్ : 9948352658 నంబరును సంప్రదించవచ్చు. అలాగే జ్యోత్స్న బ్యాంకు ఖాతా నం. 34751900991, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద్రాక్షారామ, ఐఊSఇ ఇౌఛ్ఛీ. SఆఐN 0002711 సొమ్ము జమ చేయవచ్చు.
అప్పు చేసే స్థోమత లేదు
వ్యవసాయ కూలీగా ఉన్న నేను రోజు కూలీతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఏడు సార్లు జ్యోత్స్నకు ఆపరేషన్లు చేయించాం. ఒకసారి మాత్రమే ఆరోగ్యశ్రీలో(ఎన్‌టీఆర్ వైద్య సేవ) చేశారు. ఇప్పటికే రూ.4.50 లక్షలు అప్పు చేశాను. ఇక అప్పు చేసే స్థోమత లేదు. అమ్మాయి పెద్దయ్యే వరకు దినదిన గండంగా ఎదుర్కోవాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయమేస్తోంది.
– వాసంశెట్టి వెంకటరమణ, జ్యోత్స్న తండ్రి
మూడు చక్రాల సైకిల్ అందివ్వండి
తన ఒంట్లో ఇంత బాధను తట్టుకుంటుంది కానీ, చదువుకు దూరమైతే మాత్రం తట్టుకోలేకపోతోంది. బాగా చదువుతుంది కదా ప్రైవేటు పాఠశాలలో బావుంటుందేమోనని దగ్గరలోని పాఠశాలలో చేర్చాం. కానీ వారు మీ అమ్మాయిని చూడలేమని ఇంటికి తీసుకొచ్చి దింపేశారు. ఆరోజంతా వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది. ఎవరైనా దాతలు మూడు చక్రాల సైకిల్ ఏర్పాటు చేస్తే పాఠశాలకు తనను తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుంది.
– వరలక్ష్మి, జ్యోత్సS్న తల్లి