
సాక్షి, తూర్పుగోదావరి: 29 గ్రామాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కృతిమ ఉద్యమాలు చేయిస్తున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పలేదని విమర్శించారు.‘‘మీ పెట్టుబడిదారులు అమరావతిలో 33 వేల ఎకరాలు సేకరించాకే అమరావతిని రాజధానిని చేశారు తప్ప రైతులపై ప్రేమతో కాదు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వతమైన భవనం ఏమైనా కట్టారా? మండలిలో బిల్లులు పాస్ కాకుండా చంద్రబాబు కుట్రలు చేశారని’’ ఆయన నిప్పులు చెరిగారు. ఆయన కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి చేసిందేమీ లేదని సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’)