నాగిరెడ్డి సతీష్‌రావు
రామచంద్రపురం రూరల్: ఎంపీ స్వగ్రామంలో టీడీపీ విజయమంటూ వస్తున్న ప్రచారంపై అక్కడి గ్రామస్తులు విస్తుబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్వగ్రామం. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి సతీష్‌రావు సర్పంచ్‌గా గెలుపొందారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్‌రావు పది వార్డులున్న ఈ గ్రామంలో కనీసం ఒక్క వార్డులో కూడా తన తరఫున అభ్యర్థులను నిలపలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పచ్చ మీడియా చేస్తున్న హడావుడి చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం కూడా లేదని సతీష్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment