రెడ్‌జోన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన | Cherukuvada Sriranganadha Raju Tour In Penukonda Red Zone Area | Sakshi
Sakshi News home page

రెడ్‌జోన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన

Published Mon, Apr 20 2020 4:34 PM | Last Updated on Mon, Apr 20 2020 4:46 PM

Cherukuvada Sriranganadha Raju Tour In Penukonda Red Zone Area - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పెనుగొండ రెడ్‌జోన్‌ ఏరియాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. సోమవారం నాటి పర్యటనలో భాగంగా రెడ్‌జోన్‌లోని ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో చేసిన స్వబ్ టెస్టులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెడ్‌జోన్‌ పరిధిలో ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రెడ్‌జోన్‌లోని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పోలీస్ స్టేషన్ లేదా పంచాయతీకి ఫోన్‌ చేసిన వెంటనే ఇంటి వద్దకు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement