redzone
-
కరోనా: సింహపురి రెడ్‌జోన్
సాక్షి, నెల్లూరు(పొగతోట): నెల్లూరు జిల్లాను కేంద్ర ప్రభుత్వం జిల్లాలను యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్‌గా పరిగణించింది. అయితే రాష్ట్ర స్థాయిలో భౌగోళికంగా, జనాభా పరంగా జిల్లాల విస్తీర్ణం అత్యధికం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలను యూనిట్‌గా తీసుకుని కరోనా పాజిటివ్ కేసుల లెక్కల ప్రకారం గ్రీన్, రెడ్‌జోన్ మండలాలను విభజించింది. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సడలించిన ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి. మద్యం విక్రయాలకు కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లల్లో నిబంధనలు కఠినతరం చేయనున్నారు. కృష్ణపట్నంపోర్టు, విద్యుత్, ఆయిల్, నిత్యావసర సరుకుల పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లల్లో నిత్యావసర సరుకుల షాపులు, మందుల షాపులు, అత్యవసర సేవలకు అనుమతి ఉంది. విద్యా సంస్థలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ తదితర వాటికి మాత్రం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు,. నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్, జూట్ మిల్లులు, ఐటీ హార్డ్‌వేర్ తదితర వాటికి అనుమతి ఇచ్చింది. పరిశ్రమల్లో పని చేసే కార్మికులందరూ మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉండే కూలీలతో చేయించుకోవాల్సి ఉంది. ప్రైవేట్ కార్యాలయాలు 33 శాతం మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. వైద్య సేవలు, ఐటీ సేవలు, ఇంటర్ స్టేట్స్, ఇంటర్ డిస్ట్రిక్ గూడ్సు సేవలు, నిత్యావసర వస్తువుల రవాణా, బ్యాంకింగ్, కొరియర్, పోస్టల్, అంగన్వాడీ కేంద్రాలు, అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంది. రెడ్జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయాలు, ఈ–కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. 15 రెడ్‌జోన్ మండలాలు నెల్లూరు సిటీ, నెల్లూరురూరల్, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లి, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూరు మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 32 మండలాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. -
‘బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేత’
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్‌జోన్‌గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ జోన్లోకి రావడానికి సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అతని అనుచరులు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు. దుమ్ములపేటలో పోర్టు భూముల నుంచి సేకరించిన స్థలాల్లో మడఅడవులు ఉన్నాయాని అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అవి అటవీశాఖ భూములు కావని, మత్స్య సంపదకు నష్టం కలగదని అధికారులు ఇచ్చిన పత్రాలను ద్వారంపూడి మీడియాకు విడుదల చేశారు.(శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్) ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. కాకినాడలో 34 వేల మంది లబ్దిదారులకు జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. -
రెడ్‌జోన్: చిన్నారుల దీనగాథ
సాక్షి, ఒంగోలు: కరోనా భయాందోళనలు ఓవైపు.. అందరూ ఉన్నా అనాథల్లా జీవించాల్సిన దుస్థితి మరో వైపు ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఏదైనా ఆపద వస్తే గతంలో మేమున్నామంటూ బంధువులు, ఆత్మీయులు ముందుకు వచ్చేవారు. కానీ నేడు కరోన మహమ్మారి దెబ్బకు ఆ పాడు రోగం కబళిస్తుందేమోనన్న భయంతో వారిని చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ చొరవతో వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసేందుకు కలెక్టర్ ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులో ఆదివారం నాటికి 31 పాజిటివ్ కేసులు నమోదైతే వాటిలో 23 కేసులు కేవలం ఇస్లాంపేటకు చెందిన వారివే. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా చేశారు. అక్కడికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా, అందులో ఉండేవారు బయటకు రానీయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రైమరీ కాంటాక్టు కాకుండా సెకండరీ కాంటాక్టులకు సంబంధించి ముందస్తుగా వ్యాధి వ్యాప్తి కాకుండా చాలామందిని క్వారంటైన్‌కు తరలించారు. అందులో ఒకరు ఇస్లాంపేటకు చెందిన అల్లాభక్షు. ఈయన నెల్లూరు జిల్లాలో ఆర్‌అండ్‌బీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనను ఈనెల 10న రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారు. మరుసటి రోజు ఆయన కుమారుడ్ని రిమ్స్ క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 26న వారి కోడల్ని కూడా రిమ్స్ క్వారంటైన్‌కు తీసుకువెళ్లారు. అల్లాభక్షు కుటుంబంలో మొత్తం ఏడుగురు ఉంటారు. అల్లాభక్షు భార్య రెండు నెలల క్రితం ఆమె స్వగ్రామం అయిన కాకినాడకు వెళ్లింది. గత నెల 22వ తేదీ నుంచి రాకపోకలు నిషిద్ధం కావడంతో ఆమె తిరిగి ఒంగోలుకు రాలేని పరిస్థితి నెలకొంది. అల్లాభక్షు కొడుకికి ముగ్గురు ఆడపిల్లలు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉండటంతో పెద్ద కుమార్తె మదిహ తపస్సు (9), రెండో కుమార్తె ఇస్బా (6), మూడో కుమార్తె హలీనా సాదియా (4) లను పట్టించుకునే వారు కరువయ్యారు. ఆ ఇంట్లో పైభాగంలో అద్దెకు ఉండే ఇల్లాలు ఆ పిల్లల్ని చేరదీసింది. చిన్నారుల పరిస్థితిని గుర్తించిన ‘సాక్షి’ కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ఆయన మాట్లాడుతూ కాకినాడలో ఉన్న అధికారులతో మాట్లాడి వారి నాయనమ్మకు ట్రూనాట్ పరీక్ష చేసి జిల్లాకు రప్పించడం, అదే విధంగా అల్లాభక్షు శాంపిల్‌ను త్వరగా పరీక్ష చేయించి నెగిటివ్ నిర్థారణ అయితే పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం తరఫున తీసుకునేందుకు చర్యలు చేపట్టి వారికి అండగా ఉంటామన్నారు. -
ఏపీలో మరింత తగ్గిన ఇన్ఫెక్షన్ రేటు
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇన్ఫెక్షన్ రేటు నియంత్రణ, పాజిటివ్ కేసుల తగ్గుదల శాతంలోనూ ముందడుగు వేసింది. తాజాగా రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చూస్తే రోజురోజుకు ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాటి గణాంకాల ప్రకారం ఏపీలో 74,551 టెస్టులు చేయగా.. 1,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఇన్ఫెక్షన్ రేటు కేవలం 1.58 శాతం మాత్రమే ఉన్నట్టు నమోదైంది. దేశంలో సగటు ఇన్ఫెక్షన్ రేటు 4.20 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటి వరకూ 6,65,819 టెస్టులు చేయగా 27,964 పాజిటివ్ కేసులు తేలాయి. అత్యధిక ఇన్ఫెక్షన్ రేటు మధ్యప్రదేశ్‌లో నమోదైంది. ఒక్కరోజులో 6,517 టెస్టులు సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 6517 టెస్టులు చేశారు. మొత్తం 80 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో పాజిటివ్ కేసుల శాతం 1.22 శాతంగా నమోదైంది. 86 శాతం కేసులు మూడు జిల్లాల్లోనే సోమవారం నమోదైన కేసులు కూడా రెడ్జోన్లలోనే నమోదయ్యాయి. మొత్తం 80 కేసుల్లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే 69 కేసులున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల్లోనే 86.25 శాతం కేసులు నమోదయినట్లయింది. ఏపీలో లెక్కలు ఇలా ► తాజా పాజిటివ్ కేసుల ప్రకారం రాష్ట్రంలో 20 శాతం రికవరీ రేటు నమోదైంది ► మృతుల రేటు 3.8 నుంచి 2.83కు తగ్గింది ► సగటున పది లక్షల జనాభాకు 1396 మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు ► దేశంలో పది లక్షల జనాభాకు 480 టెస్టులు జరుగుతున్నాయి ► కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంటెయిన్మెంట్ నియంత్రణకు మరింత పకడ్బందీ చర్యలు. -
విశాఖ రెడ్ జోన్ ఏరియాలో ఇండియన్ నేవీ సేవలు
-
రెడ్జోన్లలో మిని కోవిడ్-19 సెంటర్లు: ఆళ్ల నాని
-
రెడ్‌జోన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పెనుగొండ రెడ్‌జోన్ ఏరియాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. సోమవారం నాటి పర్యటనలో భాగంగా రెడ్‌జోన్‌లోని ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో చేసిన స్వబ్ టెస్టులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెడ్‌జోన్ పరిధిలో ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్‌లోని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పోలీస్ స్టేషన్ లేదా పంచాయతీకి ఫోన్ చేసిన వెంటనే ఇంటి వద్దకు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. -
శ్రీకాళహస్తి పట్టణంలో 10 రెడ్ జోన్ ప్రాంతాలు
-
రెడ్‌జోన్ ప్రాంతాల్లో రహదారుల మూసివేత
-
రెడ్‌జోన్ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు
-
రెడ్‌జోన్‌లో కాకినాడ
-
తిరుపతిలో రెడ్‌జోన్
-
‘రెడ్‌జోన్’ ఊసేదీ?
ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. దీని పరిధిలో అనేకమంది తెలుగువారు కూడా నివసిస్తున్నారు. ఇళ్లను నిర్మించి 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఖాళీ చేయాలంటూ రక్షణ విభాగం నోటీసులు ఇచ్చిందని, ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. పింప్రి, న్యూస్‌లైన్: మావల్ లోక్‌సభ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమా రు ఐదు లక్షలమందికిపైగా రెడ్‌జోన్ బాధితులున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకు డు తమకు భరోసా ఇవ్వడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఈ జోన్ పరిధిలో వేలాదిమంది తెలుగు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. డిసెంబర్ 2002లో కేంద్ర ప్రభుత్వం దేహూరోడ్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిం చింది. అయితే రెడ్‌జోన్ పరిధి ఎంత అనే విషయం తెలియకపోవడం తో అప్పట్లో అనేకమంది ఆ పరిసరాల్లో గృహనిర్మాణాలను చేపట్టారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత రక్షణ విభాగం ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఆయా కుటుం బాలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీకి 2,000 గజాల పరిధిని సంబంధిత అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఇందులో మామ డి, వికాస్‌నగర్, దేహూరోడ్ బజార్, చించోలి, కిన్హాయి, తలవడే, దేహూ, జెండా మలా, రావత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు, నిగిడి ప్రాధికరణ్, రూపీ నగర్లు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వేలాదిమంది తెలుగు ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యం లో రెడ్‌జోన్‌ను రద్దు చేయాలని లేదా దాని హద్దును తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం స్థానికులంతా ఏకతాటిపైకి వచ్చి ఇటీవల రెడ్‌జోన్ సంఘర్షణ సమితిని ఏర్పా టు చేసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీని కలసి చర్చలు జరిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజన మూ కలగలేదు. మావల్ నియోజక వర్గంలోని ఆరు శాసనసభ నియోజక వర్గాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భాగమైన చించ్వాడ్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఉంటున్న తెలుగువారు ఎన్నికలపై తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.