
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శనివారం ఆయన ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు.
నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అసత్య ఆరోపణలను చంద్రబాబు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క సెంటుభూమి ఇచ్చాడా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ శ్రీరంగనాథరాజు దుయ్యబట్టారు. గృహ నిర్మాణాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 30 లక్షల కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు కట్టిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment