సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం వాడుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆ రోజు కాంట్రాక్టుల కోసం తీసుకున్నారని, విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ‘‘ప్రాజెక్టు పనులతో పాటు పునరావాసానికి నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ సంకల్పం. (చదవండి: ‘తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు.. కానీ’)
చంద్రబాబు ఏనాడూ పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోలేదు. పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది టీడీపీనే. చంద్రబాబు టీడీపీ నేతలతో వందల కేసులు వేయించారు. హై కోర్టు క్లియరెన్సు ఇవ్వగానే 32 లక్షల పట్టాలిస్తాం. అనుమతిచ్చిన 24 గంటల్లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశాం. టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకోసం ప్రభుత్వానికి సహకరించాలని’’ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు హితవు పలికారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల)
Comments
Please login to add a commentAdd a comment