సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు భయపడుతున్న రోజుల్లో ప్రజల అవసరాల దృష్ట్యా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం పనులను ప్రారంభించారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే కుడి ఎడమ కాల్వల పనులు 80 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పోలవరం ప్రాజెక్ట్‌ను కేవలం ప్రచారానికి వాడుకున్నారు తప్ప.. ప్రాజెక్టు పనులను పూర్తిస్థాయిలో చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పోలవరం పనులు పరుగులు పడుతున్నాయన్నారు. (చదవండి: ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్)
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రాజెక్టుకు ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు’గా నామకరణం చేసి వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బృందంతో కలిసి పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ పై ఉన్న గడ్డల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయనకు గడ్డల నిర్మాణం వివిధ అంశాలపై అధికారులు ఫోటో గ్యాలరీతో వివరించారు. అనంతరం స్పిల్ వే పనులు కాపర్ డ్యాం పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చి లక్షలాది మంది జనాన్ని తరలించి ప్రచారం చేయించుకున్నారు తప్ప.. పనులు మాత్రం చేయలేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక టూరిజం హబ్ గా మార్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: 'ఇద్దరూ తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు')
Comments
Please login to add a commentAdd a comment