![Minister Sri Ranganatha Raju Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/10/Minister-Sri-Ranganatha-Raj.jpg.webp?itok=30q900ym)
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో నీరు కలుషితం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. నిత్యం రాజకీయాలు చేయడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి మంచిది కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించకుండా.. బురద చల్లుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.(చదవండి: ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు)
‘‘ఏలూరు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి స్వయంగా బాధితులును పరామర్శించారు. మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుండి ఎయిమ్స్, పూణే నుండి వైద్య బృందాలు వచ్చి బాధితుల నుండి శాంపిల్స్ సేకరించారు. త్వరలో రిపోర్ట్స్ కూడా వస్తాయని’’శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు.(చదవండి: టీడీపీ రెండు ముక్కలైంది..)
Comments
Please login to add a commentAdd a comment