ఆచంట నుంచే పోటీ... గెలిచి మళ్లీ మంత్రి పదవి చెప్పడుతా | - | Sakshi
Sakshi News home page

ఆచంట నుంచే పోటీ... గెలిచి మళ్లీ మంత్రి పదవి చెప్పడుతా

Published Wed, May 31 2023 1:23 AM | Last Updated on Wed, May 31 2023 1:23 PM

- - Sakshi

పెనుగొండ: ఆచంట నుంచి నూటికి నూరు శాతం పోటీ చేస్తున్నామని, విజయం సాధిస్తా మని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సీఎం జగన్‌ను మరోసారి సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎంగా జగన్‌ పాలన చేపట్టి నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోటీని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించి మరోసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నామని చెప్పారు. నాలుగేళ్లలో ఆచంట నియోజకవర్గంలో రూ.601 కోట్ల అభివృద్ధి పనులు చేశామని.. దీంతో పాటు రూ. 1153 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమచేశామన్నారు.

అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువ అయ్యామన్నారు. వరదల్లోనూ, కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచామని, గత ప్రజా ప్రతినిధులు ఏనాడైనా పైసా విదిల్చారా అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement