సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరిస్తున్న మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఏలూరులో నిర్వహించనున్న సిద్ధం సభ చారిత్రాత్మకంగా నిలవనుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏలూరులో సిద్ధం సభ ద్వారా ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచనలు చేయడంతో పాటు రాష్ట్రంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారన్నారు. అనంతరం సిద్ధం సభ పోస్టర్లను మంత్రి కారుమూరి ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment