సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా న్యాయవాది, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మ హిళా విభాగం అధ్యక్షురాలు గుడూరి ఉమాబాలను ఖరారు చేశా రు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వెలువడిన 6వ జాబితాలో ఆమెకు అవకాశం కల్పించారు. నరసాపురం లోక్‌సభ స్థానం చరిత్రలో తొలిసారిగా మహిళ పోటీలో నిలవనుంది.
అందులోనూ బీసీ మహిళ కావ డం విశేషం. సుమారు మూడు దశాబ్దాలుగా ఉమాబాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా రు. న్యాయవాద విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన ఆమె న్యాయవాదిగా ఉంటూనే 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2001లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఐఎస్‌ఆర్‌సీపీ మ హిళా విభాగం జిల్లా కన్వీనర్, రాష్ట్ర మహిళా వి భాగం కార్యదర్శిగా, ద్వారకాతిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా పనిచేసి ప్ర స్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. జిల్లాలో బీసీ మహిళగా మంచి గుర్తింపుతో పాటు పార్టీ రాజకీ యాల్లో చురుగ్గా పనిచేస్తున్న ఆమెకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment