
తాడేపల్లి: ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు కొత్తడ్రామాకు తెరలేపారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చచ్చిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దానిలో భాగమే ముందస్తు ఎన్నికల డ్రామా అని మంత్రి విమర్శించారు. చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనించాలని, రాష్ట్రంలో టైమ్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు మంత్రి.
‘31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ఇళ్లు నిర్మించారు. రామోజీ దిగజారి తప్పుడు రాతలు రాస్తున్నారు. 24 మార్చిలోపు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment