
ఎంటర్ ద డ్రాగన్
♦ అమరావతి అభివృద్ధికి చైనా కంపెనీతో అవగాహన ఒప్పందం
♦ నూతన రాజధానిలో చైనా పరిశ్రమల జోన్
♦ ఈ నెల 11న ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: అమరావతి అభివృద్ధి బరిలోకి మరో పుంజు వచ్చింది. నూతన రాజధాని అభివృద్ధికోసం తాజాగా చైనా కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇప్పటికే సింగపూర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన తరువాత తొలి భాగస్వామ్య సదస్సు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్టణంలో జరగనుంది. ఈ సదస్సులో నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి చైనాకు చెందిన గుజూయ్ మారిటైమ్ స్కిల్ రోడ్డు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జీఐఐసీ)తో ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) అవగాహన ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లభిస్తే భాగస్వామ్య సదస్సులో ఈ నెల 11వ తేదీన అవగాహన ఒప్పందంపై ఏపీసీఆర్‌డీ కమిషనర్ శ్రీకాంత్, జీఐఐసీ సీఈఓ జాంగ్ జాయ్ సంతకాలు చేయనున్నారు. నూతన రాజధాని నిర్మాణంలో చైనా కంపెనీల పెట్టుబడులను రాబట్టేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని జీఐఐసీ కోరినట్లు కేంద్ర అనుమతి కోరుతూ రాసిన లేఖలో అజయ్ జైన్ పేర్కొన్నారు. అమరావతిలో చైనీస్ పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేయనున్నామని, ఆ జోన్‌లోకి చైనా కంపెనీలను జీఐఐసీ తీసుకువస్తుందని ఆ లేఖలో వివరించారు.
ఏపీసీఆర్‌డీఏ ప్రాజెక్టులకు చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను కూడా మంజూరు చేయిస్తామని జీఐఐసీ పేర్కొనట్లు ఆ లేఖలో జైన్ తెలిపారు. ఏపీసీఆర్‌డీఏ, జీఐఐసీ మధ్య బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన ప్రణాళిక, ఏరియా డెవలప్‌మెంట్ ప్రణాళికపై సంప్రదింపులతో పాటు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి సమాచారాన్ని కూడా ఒకరి అనుమతి లేకుండా మరొకరు మూడో పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోను వెల్లడించరాదని, రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో పేర్కొననున్నారు.
భాగస్వామ్య సదస్సులో 18 ఒప్పందాలు...
భాగస్వామ్య సదస్సులో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మలేషియా, ైచె నా దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు అనిల్ అంబానీ, బాబా కళ్యాణి, ఆది గోద్రెజ్, రాకేశ్ భారతి మిట్టల్‌కు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో 18 అవగాహన ఒప్పందాలను చేసుకోనున్నారు. ముఖ్యంగా రిటైల్, పర్యాటక, స్కిల్ డెవలప్‌మెంట్, ఫుడ్ ప్రోసెసింగ్, ఐటీ, ఇంధన రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరుగుతాయి. అయితే నిర్దిష్టంగా ఎక్కడ ఏ పరిశ్రమను స్థాపించడం ద్వారా ఎన్ని పెట్టుబడులు పెడతారనే వివరాలు మాత్రం ఒప్పందాల్లో ఉండవు. సదస్సు చివరి రోజు బీచ్ రోడ్డులో నడుచుకుంటూ మాట్లాడుకుంటారు. సదస్సులో ఒప్పందాల వివరాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
► స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో టీమ్ లీడ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఒప్పందం
► హాస్పిటాలిటీ-సర్వీసెస్ రంగంలో ఓయో రూమ్స్‌తో ఒప్పందం ళీ ఇంధన రంగంలో విద్యుత్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం ళీ మౌలిక వసతుల రంగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం
► లాజిస్టిక్ రంగంలో లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం
► ఐటీ అండ్ ఐటీఇఎస్ రంగంలో నాస్కామ్‌తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం
► మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం ళీ స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో టాటా స్ట్రైవ్‌తో ఒప్పందం ళీ ఐటీఈ ప్లాట్‌ఫామ్ రంగంలో ఈ-కౌశల్‌తో ఒప్పందం
► ఐటీఈ స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం ళీ ప్లేస్‌మెంట్ రంగంలో ఐఎస్‌ఎఫ్‌తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో కార్న్ ఫెర్రీతో ఒప్పందం
► ఐటీ అండ్ ఐటీఇఎస్ రంగంలో ఐబీఎంతో ఒప్పందం ళీ ఐటీ అండ్ ఐటీఈఎస్ రంగంలో సామ్‌సంగ్‌తో ఒప్పందం ళీ రవాణా రంగంలో యుబీఈఆర్‌తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో ఎఫ్‌టీఏపీసీసీఐతో ఒప్పందం