వందశాతం విద్యుద్ధీకరణ, ఎల్‌ఈడీ బల్బుల వాడకం, జీరోశాతం పంపిణీ నష్టాలు సాధించే దిశగాకృషి చేసే క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారిని జిల్లాకు ముగ్గురిని ఎంపిక చేస్తామని, వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని వెల్లడించారు.
2016 జూన్ నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. అదే విధంగా మరిన్ని సోలార్ పంపుసెట్లను రైతులకు ఇస్తామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన 24 గంటల్లో కొత్తవాటిని అమర్చాలని సిబ్బందిని ఆదేశించినట్టు వెల్లడించారు.