రాయలసీమ జిల్లాల్లో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.
హైదరాబాద్: రాయలసీమ జిల్లాల్లో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు వారంలోపే అనుమతి మంజూరు చేస్తాస్తామని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. విద్యుత్ కేంద్రాల అనుమతికి నెడ్ క్యాప్ వద్దనే అనుమతులు ఉంటాయని అజయ్ జైన్ తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను సోలార్ హబ్గా మార్చుతామని అజయ్ జైన్ తెలిపారు.
వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ను సరఫరా చేస్తామన్నారు. సోలార్, విండో పవర్ ప్రాజెక్టులకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో 5వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో కొత్త విధానం అమలు చేస్తామన్నారు.